● రెండు రోజుల్లో ఎనిమిది మందిపై దాడి
● ముసుళ్లకుంటలో ప్రజల భయాందోళన
దేవరపల్లి: నల్లజర్ల మండలం ముసుళ్లకుంటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి ప్రజలపై దాడికి పాల్పడుతోంది. మంగళ, బుధవారాల్లో ఎనిమిది మందిని తీవ్రంగా గాయపరిచింది. మంగళవారం రాత్రి ముగ్గురు చిన్నారులపై దాడి చేసి గాయపరిచిన ఆ కుక్క, బుధవారం ఉదయం మార్గాని సత్యనారాయణ, ఆరేపల్లి రత్నాజీ, ఓ మహిళతో పాటు, ఇద్దరు చిన్నారులను కరిచింది. వారిని చికిత్స కోసం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
పదిన్నర కేజీల
గంజాయి స్వాధీనం
కోరుకొండ: పదిన్నర కేజీల గంజాయితో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎకై ్సజ్ శాఖ కోరుకొండ సీఐ జె.శ్రీనివాస బాలాజీ తెలిపారు. ఎకై ్సజ్ స్టేషన్ వద్ద బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోరుకొండ మండలం బూరుగుపూడి జంక్షన్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారును తరలిస్తున్న గంజాయిని గుర్తించామన్నారు. నాలుగు ప్యాకెట్లలో ఉన్న పదిన్నర కేజీల గంజాయి , నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1,600 స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయిని తరలిస్తున్న రాజస్తాన్, మన రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు.
ఆటో ఢీకొని యువకుడి మృతి
రామచంద్రపురం రూరల్: వెల్ల గ్రామంలో లాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మహిళకు తీవ్ర గాయాలైనట్టు ద్రాక్షారామ హెడ్ కానిస్టేబుల్ కె.వీరబాబు బుధవారం విలేకరులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తాళ్లరేవు మండలం పెద వలస గ్రామానికి చెందిన వనమాడి దుర్గానరేష్ (21) ఈ నెల 6న కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామానికి చెందిన మేనత్త కర్రి జ్యోతి ఇంటికి వెళ్లాడు. అనంతరం ఆమెను తీసుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో రామచంద్రపురం మండలం వెల్ల లాకుల వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆటో వీరిని ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఇద్దరినీ 108లో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా, నరేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జ్యోతిని మెరుగైన వైద్యం కాకినాడీ జీజీహెచ్‌కు తరలించారు.
లారీ ఢీకొని వివాహిత..
జగ్గంపేట: లారీ ఢీకొన్న ఘటనలో స్కూటీపై వెళుతున్న మహిళను మృతి చెందింది. ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన పోలసి జ్యోతి (45) ఒక స్కూటీపై తాను, మరో స్కూటీపై ఆమె ఇద్దరు కుమార్తెలు బుధవారం అన్నవరం సత్యదేవుని దర్శనానికి బయులుదేరారు. జగ్గంపేట మండలం రామవరం వద్దకు మధ్యాహ్న సమయానికి చేరుకున్నారు. ఆ సమయంలో జ్యోతి స్కూటీని వెనుక నుంచి వస్తున్న కంటైనర్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెనకాలే మరో స్కూటీపై వస్తున్న ఆమె ఇద్దరు కుమార్తెలు ప్రమాదాన్ని గమనించారు. జ్యోతిని అంబులెన్స్‌లో ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్ద కుమార్తె నవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు.


