మహిళా కారాగారం సందర్శన | - | Sakshi
Sakshi News home page

మహిళా కారాగారం సందర్శన

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని ప్రత్యేక మహిళా కారాగారాన్ని బోర్డు ఆఫ్‌ విజిటర్స్‌ శనివారం సందర్శించారు. ఖైదీల సంక్షేమం, ఆహారం, వైద్య సదుపాయాలు, పరిశుభ్రతపై పరిశీలనలో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా, కలెక్టర్‌ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిశోర్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పి.కోమలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖైదీలతో మాట్లాడి అక్కడి వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారిణి సీహెచ్‌ వసంతకుమారి, వైద్యాధికారిణి డాక్టర్‌ ఇందిరా భారతి రాయ్‌, జైలర్‌ పి.పావని, డిప్యూటీ జైలర్లు కారు సుభాషిణి, బి.నాగమణి, ఇతర జైలు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement