నైపుణ్యాలను పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

రాజానగరం: చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే మంచి ఉద్యోగావకాశాలను పొందగలుగుతారని రాజానగరం సమీపంలోని గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ (జీజీయూ) చానల్సర్‌ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అన్నారు. క్యాంపస్‌లో శుక్రవారం జరిగిన హెచ్‌ఆర్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించుటలో ఇటువంటి సదస్సులు ఎంతగానో తోడ్పడతాయన్నారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్‌ యు.చంద్రశేఖర్‌, ప్రొ.వీసీ డాక్టర్‌ కేవీబీ రాజు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంఎంఎస్‌ శర్మ, వివిధ సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు చెందిన హెచ్‌ఆర్‌ నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దారి తప్పి వచ్చిన జింకపై కుక్కల దాడి

దేవరపల్లి: రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు దారి తప్పిన ఓ చుక్కల జింక.. పొలాల్లోని మేకల మందతో కలిసి దేవరపల్లి మండలం యాదవోలుకు చేరుకుంది. దానిపై కుక్కలు శుక్రవారం దాడికి పాల్పడటంతో స్థానికులు గమనించి, ఆ జింకను కాపాడి, ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు వచ్చి, ఆ జింకను స్వాధీనం చేసుకుని తీసుకు వెళ్లారు. ఆ జింక చూలుతో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement