అధిక ధరకు మద్యం విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అధిక ధరకు మద్యం విక్రయిస్తే చర్యలు

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): మద్యం షాపుల్లో ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే, కేసులు నమోదు చేస్తామని, దీనిపై ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ అధికారి వై.శ్రీలత అన్నారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 159 మద్యం షాపులకు గాను 2026–27 సంవత్సరానికి 155 షాపుల యజమానులు లైసెన్సు రెన్యువల్‌ చేయించుకున్నారని చెప్పారు. తద్వారా రూ.34.73 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. బిక్కవోలు, కడియం, కొవ్వూరు, మండపేట రూరల్‌ షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. దరఖాస్తు రుసుం రూ.3 లక్షలు, ప్రొసెసింగ్‌ ఫీజు రూ.1,000 చెల్లించాలన్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా వచ్చే నెల ఒకటో తేదీ రాత్రి 12 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతి షాపునకు 4 దరఖాస్తులు అందితేనే ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్‌ 5న రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని శ్రీలత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement