గణపతి నవరాత్ర ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విఘ్నాలు తొలగించే వినాయకునికి ప్రజలందరూ ఘనంగా స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో రాజమహేంద్రి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 9,999 కొబ్బరి బొండాలతో ఏర్పాటు చేసిన నందీశ్వర నారికేళ గణపతి, రాజేంద్ర నగర్‌లో రుద్రాక్షల గణపతి, లక్ష్మ్మీవారపుపేటలో రాఖీల గణనాథుడి ప్రతిమలు ఆకట్టుకున్నాయి. ధవళేశ్వరంలో గాజుల గణేశుడు, రథం వీధిలోని పద్మనాభ గణపతి ప్రత్యేకంగా నిలిచాయి. – సాక్షి, నెట్‌వర్క్


