విహారం.. విషాదాంతం | - | Sakshi
Sakshi News home page

విహారం.. విషాదాంతం

Sep 16 2026 3:55 AM | Updated on Sep 16 2026 3:55 AM

కొంపముంచుతున్న నిర్లక్ష్యం

ప్రాణాలు కోల్పోతున్న యువత

డెత్‌స్పాట్‌లుగా వాగులు, వ్యూ పాయింట్లు

చింతూరు: రంపచోడవరం Hgñæ-ె-±ÞÌZ Ñà-Æý‡-Ķæ*-{™èlË$ M>Ýë¢ ÑÚë-§ýl-Ķæ*-{™èlË$V> Ñ$W-Í-´ù™èl$-¯é²Æ‡$$. EÌêÏ-çÜ…V> VýSyìl-õ³…-§ýl$MýS$ G…™ø E™éÞçßæ…V> CMýSP-yýlMýS$ Ð]lçÜ$¢¯]l² ç³Æ>År-MýS$Ë$ °Æý‡Ï-„ýSÅ…™ø {ç³Ð]l*-§éË$ Mö° ™ðl^èl$a-MýS$…r* {´ë×êË$ MøÌZµ™èl$-¯é²Æý‡$. {糫§é-¯]l…V> G…™ø ¿ýæÑ-çÙÅ-™èl$¢¯]l$ ^èl*yé-ÍÞ¯]l Ķæ¬Ð]l™èl Ý벯éÌS Ððl*gñæ$ÌZ ºÌSÐ]l#™èl* MýS¯]l²-Ðé-ÇMìS MýSyýl$-ç³#-Mø™èl Ñ$VýS$-Ë$çÜ$¢-¯é²Æý‡$. Hgñæ-ె-±ÞÌZ VýS™èl Æð‡…yól-â¶æ$ÏV> ÑÑ«§ýl fÌS-´ë-™éË$, òÜÌS-Äôæ$-Æý‡ÏÌZ ç³yìl 30 Ð]l$…¨ Ð]lÆý‡MýS$ Ð]l$–† ^ðl…§éÆý‡$. Hgñæ-±ÞÌZ° Ð]l*Æó‡yýl$-Ñ$-ÍÏ Ð]l$…yýl-ÌS…ÌZ fÌS™èl-Æý‡…-W×ìæ, AÐ]l$–-™èl«§éÆý‡, §ýl$ç³µÐ]l-ÌSçÜ, ´ëÐ]l¬ÌôæÆý‡$, Æý‡…ç³^ø-yýlÐ]lÆý‡… Ð]l$…yýlÌS…ÌZ Æý‡…ç³, Ayýlz-¡-VýS-ÌSÌZ í³…fÇ-Mö…yýl, Æ>f-Ðö-Ð]l$Ã…-WÌZ `MýS$«§éÆý‡, _…™èl*Æý‡$ Ð]l$…yýl-ÌS…ÌZ ´÷Ë*ÏÆý‡$, »Ÿ-yýl$z-VýS*yðl… fÌS´ë-™éË$-¯é²Æ‡$$. _…™èl*Æý‡$, Ð]l*Æó‡yýl$-Ñ$ÍÏ çœ*sŒæ-Æø-yŠæÌZ Æð‡…yýl$ Ð]lNÅ ´ëƇ$$…r$Ï Ð]l#¯é²Æ‡$$. VýS$yìlòÜ íßæÌŒæÞ™ø ´ër$ ç³Ë$ ÇÝë-ÆŠ‡tË$ MýS*yé CMýSPyýl Ð]l#¯é²Æ‡$$. ÒsìæÌZ {糫§é-¯]l…V> ´ëÐ]l¬ÌôæÆý‡$, ´÷Ë*ÏÆý‡$ fÌS-´ë-™èl…, ™èl$ÌSíÜ-´ëMýS Ð]lNÅ ´ëƇ$$…sŒæ Ð]l§ýlª fÆý‡$-VýS$-™èl$¯]l² {ç³Ð]l*-§éÌZϯól A«¨MýS-çÜ…-QÅÌZ Ķæ¬Ð]l™èl ºÌSÐ]l#-™èl$-¯é²Æý‡$.

కట్టిపడేసే అందాలెన్నో

పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, గలగలా పారే సెలయేర్లు, కొండల మాటున దాగివున్న మబ్బుతెరలు, శీతాకాలంలో కనువిందు చేసే మంచుదుప్పట్లు వంటి అందాలు ఏజెన్సీ సొంతం. నిత్యం రద్దీగా వుంటూ బిజీలైఫ్‌ గడిపే ఎంతో మంది ప్రకృతి ప్రసాదించిన అలాంటి అందాలను తిలకించేందుకు విహారయాత్రల పేరుతో పట్టణ ప్రాంతాల నుంచి వేలమంది పర్యాటకులు ఏజెన్సీకి వస్తున్నారు. మైదాన ప్రాంతాల నుంచి వచ్చేవారికి రంపచోడవరం దాటగానే ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. ఇక్కడకు కుటుంబాలతో కలసి వస్తున్న పర్యాటకులు జలపాతాలు, సెలయేర్లలో సందడి చేస్తున్నారు. కొంతమంది అడవుల్లో వున్న రిసార్ట్‌లలో రాత్రిపూట గడుపుతూ వీకెండ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు.

నిర్లక్ష్యం, ప్రాణాపాయం

ఇక్కడకు వస్తున్న పర్యాటకులు జలపాతాలు, సెలయేర్ల లోతును అంచనా వేయక నిర్లక్ష్యంతో వాటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. జలపాతాలు, సెలయేర్లలో కొన్నిచోట్ల కనబడకుండా లోతైన గోతులు ఉండడంతో సరిగా ఈతరాని పర్యాటకులు వాటిలో చిక్కుకుని బలవుతున్నారు. దీంతో పాటు కొంతమంది యువత సెల్ఫీల మోజులో జలపాతాల పైకి వెళ్లి సెల్ఫీలు తీసుకునే క్రమంలో అక్కడి నుంచి కిందనున్న బండరాళ్లపై పడుతున్నారు. ఇదే క్రమంలో వెనుకనున్న నీటితో సెల్ఫీలు తీసుకునేందుకు సెలయేళ్ల అంచుల వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ వాటిలో పడి మృత్యువాత పడుతున్నారు. మరోవైపు చాలామంది పర్యాటకులు జలపాతాలు, వ్యూ పాయింట్ల వద్ద మద్యం తాగి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. మద్యం మత్తులో జలపాతాల వద్దనున్న బండరాళ్లపై ఎక్కుతుండడంతో అక్కడి నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు.

డెత్‌ స్పాట్‌లుగా..

ప్రధానంగా ఘాట్‌రోడ్‌లో తులసిపాక సమీపంలోని వ్యూ పాయింట్‌, పొల్లూరు జలపాతం, దారాలమ్మ పిక్నిక్‌ స్పాట్‌, పాములేరు వాగు డెత్‌స్పాట్‌లుగా మారాయి. ఈ ప్రాంతాల్లోనే అత్యధిక మరణాలు సంభవించడంతో వాటిపై దృష్టి సారించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జలపాతాలు, వాగులు, వ్యూ పాయింట్ల వద్ద ప్రమాదం పొంచి వుందని పోలీసులు హెచ్చరిక బోర్డులు పెడుతున్నా పర్యాటకులు వాటిని పట్టించుకోకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. ‘మీ విహారయాత్రలో విషాదం జరగకుండా మీ జీవితం మీ చేతుల్లోనే’ అనే కాప్షన్‌తో ఏర్పాటు చేసిన ఈ బోర్డుల్లో ఆయా ప్రదేశాల్లో బండరాళ్లు, లోతైన గుంటలు, ఊబి ప్రాంతాలు ఉంటాయని, వాగులో స్నానాలు చేయడం, ఈతకొట్టడం, సెల్ఫీలు దిగడం చేయవద్దని సూచించారు. హటాత్తుగా నీటిప్రవాహం పెరిగే అవకామున్నందున అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్న పోలీసుల మాటలను పర్యాటకులు పెడచెవిన పడుతున్నారు. ప్రమాదకరంగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల మధ్యలో వున్న రాళ్లపైకి వెళుతున్న యువత పట్టుజారి నీటి ఉధృతికి గల్లంతై మృత్యువాత పడుతున్నారు.

పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి

మన్యం అందాలు తిలకించేందుకు వస్తున్న పర్యాటకులు వాగులు, జలపాతాల వద్ద స్నానాలకు దిగేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. లోతు తక్కువగా వున్న ప్రాంతాల్లో మాత్రమే స్నానాలు చేయాలి. మద్యం తాగడం, బండరాళ్లపై ఎక్కడం వంటి చర్యలు మానుకోవాలి. ప్రమాదాల నివారణకు జలపాతాలు, వ్యూ పాయింట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నాం.

– గోపాలకృష్ణ, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, చింతూరు

మృతి చెందిన వారి వివరాలు ఇలా..

రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని పర్యాటక కేంద్రాల వద్ద జరిగిన వివిధ ప్రమాదాల్లో 30 మంది మృతి చెందారు. చింతూరు సర్కిల్‌లోని మోతుగూడెం పోలీసుస్టేషన్‌ పరిధిలో 13 మంది వరకు, డొంకరాయి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఇద్దరు, చింతూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఐదుగురు మృతి చెందగా ఎటపాక సర్కిల్‌లోని వీఆర్‌ పురం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒకరు మృతి చెందారు. మారేడుమిల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని పాములేరు వాగులో మునిగి ఐదుగురు, జలతరంగిణి వద్ద మునిగి నలుగురు మృతి చెందారు. తాజాగా మంగళవారం చింతూరు మండలం తులసిపాక సమీపాన సోకిలేరు వ్యూ పాయింట్‌ వద్ద జరిగిన ఘటనలో విజయవాడకు చెందిన కోసూరు నీలేష్‌ (26) అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వాగులో పడి మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement