కల్వర్టును ఢీకొన్న వ్యాన్‌ | - | Sakshi
Sakshi News home page

కల్వర్టును ఢీకొన్న వ్యాన్‌

Sep 13 2026 12:30 AM | Updated on Sep 13 2026 12:30 AM

తీవ్ర గాయాలపాలైన వ్యక్తి

చికిత్స పొందుతూ మృతి

మరొకరికి స్వల్ప గాయాలు

దేవరపల్లి: మండలంలోని యర్నగూడెం గండి చెరువు వద్ద శనివారం వ్యాన్‌ కల్వర్టును ఢీ కొంది. ఈ ప్రమదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నిడదవోలు మండలం కోరుమామిడి నుంచి విజయవాడ సౌండ్‌ సిస్టం పరికరాలను తీసుకు వెళుతున్న వ్యాన్‌ గండి చెరవు వద్ద పాలేటి వాగుపై గల కల్వర్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్‌లో ఉన్న ముగ్గరు వ్యక్తులో కోరుమామిడికి చెందిన వడలి సురేష్‌(29) తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్‌ మృతి చెందినట్టు ఎస్సై పి. మనోహార్‌ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement