కొన్ని రకాల సర్జరీల అనంతరం ఫిజియోథెరపీ కీలకం అవుతుంది. ఆపరేషన్ తర్వాత వ్యాయామం లేకుంటే కండరాల్లో ఫైబ్రోసిస్ అభివృద్ధి చెంది వంకర్లు పోతాయి. ఎక్కువ రోజులు మంచంపై ఉంటే కాళ్లలో రక్తం గడ్డకట్టి ఎంబాలిజం వచ్చి గుండె, మెదడుకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఆపరేషన్‌తో పాటు రోగి సాధారణ స్థితికి త్వరగా రావడానికి ఫిజియోథెరపీ చాలా అవసరం.
–కె.వెంకటరామన్, ఫిజియోథెరపిస్ట్, రాజమహేంద్రవరం
మొండి నొప్పులకు ఉపశమనం
మా వద్దకు తీవ్రమైన నొప్పులతో వస్తుంటారు. అలాంటి వారికి సమస్యను గుర్తించి అవసరమైన థెరపీల ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాం. సమస్యను బట్టీ ఒక్కొక్కరికి నెల నుంచి రెండు నెలల కూడా సమయం పడుతుంది. నడుము, మోకాలు, మెడ, భుజం నొప్పులతో ఎక్కువ మంది వస్తున్నారు. వారిని సాధారణ స్థితికి తీసుకు వచ్చిన తర్వాత జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తాం.
–కె.వెంకటేష్, ఫిజియోథెరపిస్టు, కాకినాడ
●


