మలికిపురం: మేజర్ డ్రైన్‌లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గొల్లపాలేనికి చెందిన ఉండ్రాసి దుర్గాప్రసాద్ (38) కొబ్బరి దింపు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం గ్రామంలో వినాయక చవితి పందిరి పనులు చూసి, అనంతరం దింపు పనులకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా గొల్లపాలెం వంతెన నుంచి శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఒడ్డున బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఈ మేరకు అతని తండ్రి ఉండ్రాసి సత్యనారాయణ తెలిపారు. దుర్గాప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


