సకాలంలో ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో ఆదుకోవాలి

Sep 8 2026 12:23 AM | Updated on Sep 8 2026 12:23 AM

అదనంగా పంట పొగాకు అమ్మకోవడానికి కోటా విడుదల చేయాలి. రీజియన్‌ పరిధిలో సుమారు 35 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. బోర్డు ఇచ్చిన కోటాలు పూర్తి కావడంతో అదనపు పంట అమ్ముకోవడానికి దారిలేదు. ఎక్కడ పొగాకు అక్కడే ఉంది. రంగు మారి నాణ్యత దెబ్బతింటుంది. సకాలంలో అమ్ముకోకపోతే నష్టపోతాం. కిలో రూ. 350 ధర ఉంటే గిట్టుబాటు అవుతుంది.

–వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు, గోపాలపురం

ఉత్తర్వులు రావాలి

అదనపు పొగాకు కొనుగోలుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రావాలి. అదనపు పొగాకు విక్రయాలకు విధివిధానాలు ఖరారు కావాలి. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలో సుమారు 4 మిలియన్ల పొగాకు అదనంగా ఉత్పత్తి జరిగింది. కిలో గరిష్ఠ ధర రూ.325 పలుకుతుంది. వచ్చే ఏడాదికి పరిమితికి లోబడి పంట సాగు చేయాలి. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

–పి.హేమస్మిత, టొబాకో బోర్డు వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement