పిఠాపురం రూరల్: రాజమహేంద్రవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆర్చరీ పోటీల్లో పిఠాపురానికి చెందిన 10 మంది క్రీడాకారులు పథకాలు సాధించారని కోచ్‌లు పి.కృష్ణ, లక్ష్మణరావు తెలిపారు. జె.ఐశ్వర్య, బి.జైదీప్ స్వర్ణ పథకాలు సాధించగా, జె.అరుణ్. పి.లోకేష్ రజిత పథకాలు, కె.హరిణి, లాస్య, యశస్విన్, తరుణ్, అమీదా, అలీ కాంస్య పథకాలు సాధించారన్నారు. వీరంతా జూనియర్ విభాగంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పాల్గొంటారన్నారు. సీనియర్ విభాగంలో ఎంపికై న వారు వచ్చే నెల 4 వతేదీ నుండి 7 తేదీ వరకు భీమవరంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ సీనియర్స్ విభాగంలో పాల్గొంటారని వారు తెలిపారు.


