దిండి వంతెనపై యువకుడి గల్లంతు
మలికిపురం: అమ్మా, నాన్న క్షమించండి.. సారీ హరి.. నాకు ఈ ఆప్షన్ తప్ప మరొకటి కనిపించడం లేదంటూ ఓ యువకుడు తన బైక్‌పై లేఖ రాసి పెట్టి గల్లంతైన ఘటన దిండి వంతెనపై జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలంక గ్రామానికి చెందిన దారపురెడ్డి తరుణ్‌కుమార్ (22) దిండి – చించినాడ వంతెనపై తన మోటార్‌సైకిల్ ఉంచి కనిపించకుండా పోయాడు. సోమవారం ఉదయం మలికిపురంలోని షాపులో పని చేసేందుకు వెళ్లిన అతను, ఆ తర్వాత కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దిండిలో వంతెన వద్ద తన బైక్, దానిపై ఓ లేఖను పోలీసులు, బంధువులు గుర్తించారు. అసలు కారణం తెలియలేదు. ఆ యువకుడు నదిలో దూకాడా, ఎక్కడికై నా వెళ్లిపోయాడా అనేది తేలాల్సి ఉంది. తరుణ్‌కుమార్ సొంత ఊరు నర్సాపురం. సఖినేటిపల్లిలంకలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు.


