రాజానగరం: దివాన్‌చెరువు నుంచి శ్రీరామపురం వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఉన్న ఓ లేఅవుట్‌లో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బొమ్మూరు సీఐ పి.కాశీవిశ్వనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని, మృతుని వివరాల కోసం అన్వేషించారు. 50 ఏళ్ల పైబడిన వ్యక్తిగా ఉన్న అతను చేతికి స్టీల్ కడియం, చేతిపై ‘లవ్’ సింబల్, మరో చేతిపై ‘హాయ్’ అనే హిందీ అక్షరాలతో పచ్చబొట్లు ఉన్నాయి. ఎవరైనా గుర్తిస్తే వెంటనే 94407 96587, 93477 41118 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.
అట్రాసిటీ కేసు నమోదు
కంబాలచెరువు: ఓ మహిళపై సోమవారం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన కడా శ్రీదేవి, ప్రసన్నకుమారిల మధ్య డబ్బులకు సంబంధించి లావాదేవీల్లో తగాదా వచ్చింది. దీంతో శ్రీదేవి, ఆమె బంధువులు కోర్టులో కేసు వేశారు. ఈ క్రమంలో కేసు వాయిదాకి వెళ్లి వస్తుండగా, కోర్టు బయట శ్రీదేవిని ప్రసన్నకుమారి కులం పేరుతో దూషించింది. ఈ మేరకు ఆమె మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


