అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌ | - | Sakshi
Sakshi News home page

అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌

Aug 13 2026 12:15 AM | Updated on Aug 13 2026 12:15 AM

తాచుపాము హల్‌చల్‌

మామిడికుదురు: పాశర్లపూడిలంక అంబేడ్కర్‌ నగర్‌ కాలనీలో ఓ ఇంటి వద్ద బుధవారం తాచుపాము కలకలం రేపింది. దాన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై ప్లాస్టిక్‌ గొట్టం సాయంతో పట్టుకుని, బిందెలో బంధించారు. అనంతరం గ్రామానికి దూరంగా తీసుకెళ్లి వదిలి పెట్టారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని

ఇద్దరు వైద్యులకు తీవ్ర గాయాలు

మారేడుమిల్లి: కారును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వైద్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని పామేరుకు చెందిన నలుగురు వైద్యులు మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు కారులో బయలుదేరారు. మారేడుమిల్లి – భద్రాచలం ఘాట్‌ రోడ్డులో రామ లక్ష్మణ ఘాట్‌ సమీపాన బుధవారం మధ్యాహ్నం ఎదురుగా వస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన ఆర్టీసీ బస్సు వారి కారును ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు సీట్లలో ఉన్న 40 ఏళ్ల హరీష్‌ శంకర్‌, 21 ఏళ్ల శివప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వం ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ఈ ఘటనపై మారేడుమిల్లి ఎస్సై కె.శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

30 టన్నుల

రేషన్‌ బియ్యం పట్టివేత

పిఠాపురం రూరల్‌: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అధికారులు బుధవారం పట్టుకున్నారు. పిఠాపురం నుంచి గోర్ప వెళ్లే రోడ్డులో ఒక రైస్‌ మిల్లు 30 టన్నుల (280 బస్తాలు) బియ్యాన్ని తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. ఆ లారీలో ఉన్నవి పీడీఎస్‌ బియ్యంగా ఎంఎస్‌వో సంధ్య నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ లారీని పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

శిక్షణతో మరిన్ని

ఉత్తమ సేవలందించాలి

సామర్లకోట: వివివిధ అంశాలపై 30 రోజుల పాటు పొందిన శిక్షణతో ఆయా మండలాల ప్రజలకు మరిన్ని ఉత్తమ సేవలందించాలని విస్తరణ శిక్షణ కేంద్రం (ఈటీసీ) ప్రిన్సిపాల్‌ కేఎన్‌వీ ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 12 జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీవోలకు గత నెల 13న ప్రారంభమైన శిక్షణ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజల విశ్వాసం పొందేలా పని చేసి పంచాయతీరాజ్‌ శాఖకు గౌరవం పెంచాలన్నారు. శిక్షణకు సంబంధించిన నిర్వహించిన పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన వారికి బహుమతులు, శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ సిర్టి ఫికెట్లు అందించారు. కార్యక్రమంలో డీడీఓ శర్మ, ఎంపీడీఓ శేషు బాబు, ఫ్యాకల్టీలు చిన్నబ్బులు, చక్రపాణిరావు, నిహారిక, జగన్నాథం, విజయకుమార్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

వీబీజీ రామ్‌జీపై ఎంపీడీఓలకు శిక్షణ

గ్రామీణ ఉపాధి హమీ పథకం పేరు మారడంతో వీబీజీ రామ్‌జీపై అవగాహన పెంచుకొనే విధంగా వివిధ మండలలోని ఎంపీడీఓకు రెండు రోజుల పాటు ఐదు బ్యాచ్‌లలో ఇచ్చిన శిక్షణ బుధవారంతో పూర్తయినట్టు ప్రిన్సిపాల్‌ ప్రసాదరావు తెలిపారు. జూన్‌ 23 నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 169 మంది ఎంపీడీఓలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు.

కొబ్బరి రకం ధర (రూ.ల్లో)

కొత్త కొబ్బరి (క్వింటాల్‌) 16,000 – 17,000

కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000

కురిడీ కొబ్బరి (పాతవి)

గండేరా (వెయ్యి) 27,000

గటగట (వెయ్యి) 24,000

కురిడీ కొబ్బరి (కొత్తవి)

గండేరా (వెయ్యి) 25,500

గటగట (వెయ్యి) 23,000

నీటికాయ

పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000

కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000

కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000

కిలో 350

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement