● ఖర్జూరాల్లో కనిపించిన పరుగులు
● అంగన్‌వాడీ లబ్దిదారు బెంబేలు
సీతానగరం: అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు పోష్టికాహార కిట్లను పంపిణీ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గర్భిణులు, బాలింతల్లో రక్త హీనతను తగ్గించడానికి, సంపూర్ణ ఆరోగ్యానికి వీటిని తప్పకుండా తినాలని చెబుతారు. అయితే మిర్తిపాడు ఎస్సీపేట అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం పంపిణీ చేసిన ఖర్జూరం ప్యాకెట్లలో పురుగులు రావడం విస్మయానికి గురి చేసింది. పైన చక్కగా ప్యాకింగ్ ఉన్నా, లోపల ఉన్న ఖర్జురాలను తెరిచి చూస్తే పెంకు పరుగులు, నల్లటి లార్వాలు దర్శనమిచ్చాయి. దీంతో లబ్ధిదారు ఆందోళనకు గురయ్యారు. వీటిని తింటే సంపూర్ణ ఆరోగ్యం మాట దేవుడెరుగు, తీవ్రమైన కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాంట్రాక్టర్లు ప్యాకింగ్ చేసి పంపిన సరుకులను ఐసీడీఎస్ అధికారులు సరిగ్గా తనిఖీ చేయకుండానే అంగన్ వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


