బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

రాజవొమ్మంగి: మోటారు సైకిల్‌ అదుపు తప్పి తిరగబడడంతో లాగరాయి గ్రామానికి చెందిన సుబ్బయ్య (సుబ్బు) మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సుబ్బయ్య మోటారు సైకిల్‌పై సిమెంటు ఇటుకలను పెట్టుకుని పొరుగూరు నుంచి లాగరాయి వస్తున్నాడు. మార్గం మధ్యలో కొండవాగుకు వాలుగా ఉన్న కల్వర్టు దాటుతూ బైక్‌తో సహా జారిపడ్డాడు. అతడిని వెంటనే అదే గ్రామంలోని పీహెచ్‌సీకి తరలించగా, వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స చేసి పంపించారు. ఇంటికి వచ్చిన సుబ్బయ్య కాసేపటికి ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యాడు. అతడిని తిరిగి ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తొండంగి: బైక్‌ అదుపు తప్పి మహిళకు ఢీకొన్న ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, మోటారు సైకిలిస్టు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లింగాల కాలనీకి చెందిన పూసర్ల లక్ష్మణరావు (55) మంగళవారం ఉదయం బైకుపై కత్తిపూడి వెళుతున్నాడు. తమ్మయ్యపేట సమీపంలోని బీపీసీఎల్‌ బంకు అతడి బైక్‌ అదుపు తప్పి రోడ్డుపై వెళుతున్న ఆ గ్రామానికి చెందిన పెయ్యల రమణమ్మ అనే వృద్ధురాలిని ఢీకొన్నాడు. ఈ ఘటనలో రమణమ్మకు కాలికి, రోడ్డుపై పడిపోయిన లక్ష్మణరావు తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం లక్ష్మణరావును కాకినాడలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణరావును వైద్యులు పరిశీలించి వైద్యం అందించగా కొద్ది సేపటికీ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జగన్మోహన్‌రావు తెలిపారు. లక్ష్మణరావు లింగాల కాలనీలో కిరణా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య జ్యోతి, కుమార్తె అనూరాధ, కుమారుడు తేజ ఉన్నారు.

లారీ ఢీకొని

భార్యాభర్తలకు గాయాలు

కంబాలచెరువు: లాలాచెరువు వద్ద లారీ ఢీకొని భార్యాభర్తలకు గాయాలైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. శంభునగర్‌కు చెందిన దేశాబత్తుల త్రిమూర్తులు, దేశాబత్తుల దివ్యరేఖ జీఎల్‌ఎస్‌ ఆసుపత్రికి వెళుతున్నారు. వీరిని రెడీ టు మిక్స్‌ కంకర లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై ప్రకాశ్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement