16 వరకు ఎయిర్‌పోర్టులో రెడ్‌ అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

16 వరకు ఎయిర్‌పోర్టులో రెడ్‌ అలర్ట్‌

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

కోరుకొండ: ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ నెల 16 వరకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రెడ్‌ అలర్ట్‌ విధించినట్టు డైరెక్టర్‌ కె,ప్రీత తెలిపారు. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు అపరిచితులకు అనుమతులు నిలిపివేశామని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టును చూసేందుకు సందర్శకులకు కూడా అనుమతులుండవని స్పష్టం చేశారు.

ఎన్‌ఎంఎంఎస్‌

ఫలితాల విడుదల

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌) ఫలితాలు విడుదలయ్యాయని జిల్లా పాఠశాల విద్యా శాఖ అధికారి కె.వాసుదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌ 7న నిర్వహించిన ఈ పరీక్షలో ఎంపికై న విద్యార్థుల వివరాలు ఈ నెల 12 నుంచి బీఎస్‌ఈ ఆంధ్రప్రదేశ్‌ వెబ్‌సైట్‌లో ఉంటాయన్నారు. ఎంపికై న విద్యార్థులు వెంటనే బ్యాంకు ఖాతా తెరిచి, దానిని తమ ఆధార్‌తో అనుసంధానం చేసుకుని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఉపకార వేతనం జమయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎంపికై న విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి తమ మెరిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకుని, పేరు, పుట్టిన తేదీ, తండ్రి, తల్లి పేరు తదితర వివరాలు ఆధార్‌ కార్డులో ఉన్న విధంగానే ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా వివరాలు సరిపోవాలని సూచించారు. అనంతరం నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. వివరాల్లో ఏవైనా తేడాలుంటే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని డీఎన్‌వో, ఏసీజీకి వెంటనే తెలియజేయాలని వాసుదేవరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement