అత్యుత్సాహం ప్రదర్శించి.. | - | Sakshi
Sakshi News home page

అత్యుత్సాహం ప్రదర్శించి..

Aug 8 2026 12:23 AM | Updated on Aug 8 2026 12:23 AM

టెంట్లు

తొలగించి..

శాంతియుత నిరసనపై ‘కూటమి’

కుట్ర పన్నింది.. టెంట్లు తొలగించేలా, దీక్ష భగ్నం చేసేలా ఖాకీలకు పని చెప్పింది.. చివరకు ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అత్సుత్సాహం ప్రదర్శించినా, చివరికి నిరసన మొక్కవోని దీక్షతో కొనసాగింది. దీనికి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మద్దతు తోడవడంతో ఆందోళన విజయవంతమైంది.

తొండంగి: దగా డీఎస్సీపై వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో తొండంగిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, యువత దీక్షను కొనసాగించారు. కాకినాడ జిల్లాలోని మండల కేంద్రమైన తొండంగి గ్రామంలోని ఓ ప్రైవేటు స్థలంలో రిలే దీక్షకు ఏర్పాట్లు చేసుకోగా, స్థల యజమానిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి బెదిరించారు. దీంతోపాటు గురువారం రాత్రి ప్రతిపాదిత దీక్షా స్థలంలో ఏర్పాటు చేసుకున్న స్టేజీని, ఇతర సామగ్రిని తొలగించారు. పోలీసుల బెదిరింపులకు లొంగని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, యువత శుక్రవారం ఉదయం తొండంగిలోనే పార్టీ నాయకుని స్థలం వద్ద మళ్లీ టెంట్‌ ఏర్పాటు చేసుకొని రిలే నిరాహార దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొండంగి ఎస్సై జగన్మోహన్‌రావు, ఇతర పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో సివిల్‌ డ్రెస్‌లో అక్కడకు చేరుకుని రిలే దీక్షను భగ్నం చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ వైఎస్సార్‌ సీపీ శ్రేణులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేపట్టాయి. అనంతరం, పోలీసులు యూనిఫాం ధరించి దీక్షాస్థలం వద్ద టెంట్లను తొలగించారు. దీంతో, నిరసనకారులు మొక్కవోని దీక్షతో మండుటెండలోనే రిలే దీక్షలో కూర్చున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వారందరికీ గొడుగులు ఏర్పాటు చేయించారు. ఆ గొడుగులు చేతబట్టి సాయంత్రం వరకూ రిలే దీక్ష కొనసాగించారు. దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలని, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ బేషరతుగా రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు

దీక్షకు సంఘీభావం

దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపి నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని యువత చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సంఘీభావం తెలిపారు. దీక్షలో కూర్చుని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా రాజా విలేకర్లతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత వాతావరణంలో వైఎస్సార్‌ సీపీ యువత చేస్తున్న రిలే దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులను వినియోగించుకుని రెడ్‌బుక్‌ పేరుతో దుష్టపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

ఫ తొండంగిలో దీక్షను

భగ్నం చేసేందుకు కుట్ర

ఫ తగ్గేది లేదన్న

వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, యువత

ఫ సంఘీభావం తెలిపిన

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement