ఫ అధినేతతో భేటీ | - | Sakshi
Sakshi News home page

ఫ అధినేతతో భేటీ

Aug 5 2026 12:12 AM | Updated on Aug 5 2026 12:12 AM

వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట త్రిమూర్తులు మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

– సాక్షి, అమరావతి

కడలిలోకి

4.86 లక్షల క్యూసెక్కులు

ధవళేశ్వరం: కాటన్‌ బ్యారేజీ నుంచి మంగళవారం 4,86,566 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.80 అడుగులకు చేరింది. ఎగువన కాళేశ్వరంలో 7.30 మీటర్లు, పేరూరు 11.92, దుమ్ముగూడెం, 8.42 మీటర్లు, భద్రాచలంలో 29.10 అడుగులు, కూనవరంలో 13.98 మీటర్లు, కుంట 5.33, పోలవరం 9.74, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.88 మీటర్ల మేర గోదావరి నీటిమట్టాలు నమోదయ్యాయి.

లోక్‌ అదాలత్‌ను

వినియోగించుకోవాలి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా వచ్చే నెల 12న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌ను సమర్థవంతంగా వినియోగించుకుని, ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైధ్‌ అహ్మద్‌ మౌలానా సూచించారు. లోక్‌ అదాలత్‌ను పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్‌ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌ అదాలత్‌లో పరిష్కరించేందుకు అనువైన పెండింగ్‌ ఎకై ్సజ్‌ కేసులు, రాజీ పడదగిన కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజీకి అనువైన కేసుల వివరాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ)కు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి యార్లగడ్డ, కాకినాడ, కోనసీమ జిల్లాల ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్లు ఎం.కృష్ణకుమారి, ఆర్‌ఎస్‌ కుమరేశ్వరన్‌, జిల్లా అసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ అధికారి వై.శ్రీలత, పోలవరం జిల్లా అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఏవీబీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

సురక్షితమైన నీరే తాగాలి

రాజమహేంద్రవరం రూరల్‌: ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సురక్షితమైన నీరే తాగాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) పి.కోమల సూచించారు. వాటర్‌, శానిటేషన్‌ అండ్‌ హైజీన్‌ అనే అంశంపై బొమ్మూరులోని వైటీసీ ప్రాంగణంలో అప్మాస్‌ సంస్థ, వాటర్‌.ఓఆర్‌జీ సహకారంతో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్‌షాపులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యంగా వర్షాకాలంలో డయేరియా, కలరా, టైఫాయిడ్‌, హెపటైటిస్‌ వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ సురక్షితమైన తాగునీటినే వినియోగించాలని అన్నారు. తాగునీటిని పరిశుభ్రమైన పాత్రల్లో నిల్వ చేసుకోవాలని, మరుగుదొడ్లను తప్పనిసరిగా వినియోగించడం, భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి అలవాట్లను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ వర్క్‌షాప్‌లో పలువురు అధికారులు పాల్గొని, జిల్లాలో సురక్షిత తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాల విస్తరణపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement