● ఏ పయనం ఏ గమ్యానికో..!
● జాడ లేని వాన.. బీడువారిన వరి..
బహుశా ఈ రహదారులపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పుడూ రాకపోకలు సాగించరేమో.. ఈ రోడ్లపై వెళ్తే అటు వాహనాలకు, ఇటు చోదకులకు సైతం కూసాలు కదిలిపోయేలా ఉంది పరిస్థితి. కొవ్వూరు డివిజన్‌లోని నిడదవోలు–కొవ్వూరు–ఐ.పంగిడి ప్రధాన రహదారుల పరిస్థితి ఇది. ఏ వర్షమో పడితే ఆ ప్రయాణం ఇంక నరకప్రాయమే. ఎక్కడ ఎంతలోతు గొయ్యి ఉందో తెలియక వాహనాలు మునిగిపోయి.. ఇంజిన్లలోకి నీరు వెళ్లిపోయి.. కాలు ఆన్చడానికి అవకాశం లేక పడిపోవడం తప్ప మరో దారి లేదు. ఏటా గోతులు పూడ్చేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నా, ఆ పనుల్లో నాణ్యత లేక మూణ్నాళ్లకే ఈ పరిస్థితి నెలకొంటోంది. ఇకనైనా శాశ్వత ప్రాతిపదికన రహదారులు మరమ్మతు చేయాలని ప్రయాణికులు పాలకులను కోరుతున్నారు. చాగల్లు
సీతంపేటలో పెండ్యాల
పంపింగ్ స్కీమ్ మలుపులో..


