కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పీడీ యాక్ట్‌లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న వైఎస్సార్ సీపీ బీసీ సెల్ నగర అధ్యక్షులు పీతా రామకృష్ణ ఆదివారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా తాను బయటకు రావడానికి కృషి చేసిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావులను ఆయన కలసి కృతజ్ఞతలు తెలిపారు. వార్డు కార్యక్రమాల్లో అవకతవలు చేస్తున్న టీడీపీపై పార్టీ తరఫున పోరాడడంతో కక్ష కట్టి తనను జైలుకు పంపారన్నారు. తనపై 12 కేసులు ఉండగా, 10 కేసులు కోర్టు కొట్టివేసిందని, అయితే కేవలం 2 కేసులను సాకుగా చూపి పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపారని రామకృష్ణ తెలిపారు. దీనిపై పార్టీ నాయకులు న్యాయ పోరాటం చేయడంతో ఆ కేసులు కొట్టివేశారన్నారు.


