కళ్లాలు లేని డ్రైవింగ్
● ఈ నెల 3వ తేదీన రంగారెడ్డి జిల్లాకు చెందిన గోపాలకృష్ణారావు (62) జీలుగుమిల్లి వెళ్లేందుకు రాజమహేంద్రవరం బస్ స్టాండ్ వద్ద నించుని ఉండగా భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
● ఇదే నెలలో 13న వై.రామవరం మండలం పనసలపాలెం గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు– ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి ఎన్నో ప్రమాదాలు ఆర్టీసీ బస్సులు కారణమవుతున్నాయి.
ఇలాంటి అనుభవాలను పక్కనపెట్టి ప్రభుత్వం జీరో ప్రమాదాల లక్ష్యంగా ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలకు అర్ధంకాని పరిస్థితి నెలకొంది.
‘బస్సు చక్రం ప్రగతికి చిహ్నం’..ఇదీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులపై ఉండే నినాదం. అప్పటి పరిస్థితులకు ఈ నిర్వచనం తగినదే అయినా మారి పరిస్థితులకు అనుగుణంగా ప్రగతి సాధించడంలో ఆర్టీసీ విఫలమైందని చెప్పక తప్పదు. హైఫై బస్సులు, లగ్జరీ బస్సులు, నాన్‌స్టాప్‌లు, మెట్రో, ఏసీ, ఇంద్ర ఇలా ఎన్ని బస్సులు ప్రవేశపెట్టినా సగటు జీవికి అవన్నీ నిరుపయోగమే. పల్లె పల్లెకీ బస్సులు నడుపుతూ ఎంత మందికి సేవ చేశామన్నదే ముఖ్యం. ఆర్టీసీ సేవలను ప్రజలు ఏమని నిర్వచిస్తున్నారన్నదే అత్యంత ప్రధానం.
కపిలేశ్వరపురం: ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం పేరుతో రోడ్డు ప్రమాదాల నివారణపై ఆర్టీసీ సిబ్బందిలో మరింత అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదివారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహించనున్నట్టు జిల్లా ప్రజా రవాణాధికారి వైఎస్‌ఎన్ మూర్తి ఇటీవల ప్రకటించారు. జీరో ప్రమాదాలే లక్ష్యంగా డ్రైవర్లు, కండక్టర్లు, సాంకేతిక సిబ్బందికి రహదారి భద్రతపై శిక్షణ, కౌన్సెలింగ్ ఇవ్వడం వారోత్సవాల ప్రధాన ఉద్దేశమన్నారు.
అరకొర వసతులతో సీ్త్రశక్తి పథకం
గతేడాది ఆగస్టు 15 నుంచి సీ్త్రశక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు, గోకవరం, నిడదవోలు డిపోల్లో అద్దె బస్సులతో కలిపి మొత్తం 283 బస్సులు జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ 71 రూట్లలో తిరుగుతున్నాయి. ఆయా డిపోల పరిధిలో సుమారు 478 మంది డ్రైవర్లు, 395 మంది కండక్టర్లు, 80 మందికి పైగా ఆన్‌కాల్డ్ డ్రైవర్లు ఉన్నారు.
సిబ్బంది, విద్యార్థుల అవస్థలు ఇలా..
పెరుగుతున్న సర్వీసులు, ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు, సిబ్బంది, డిపోల సామర్థ్యాలను పెంచకుండా ఉన్న వనరులతోనే మహిళలకు ఉచిత ప్రయాణాలు ప్రారంభించేసి, మిగిలిన బస్సులతో రద్దీ ప్రయాణాలను నిర్వహిస్తూ అటు సిబ్బందిని, ఇటు ప్రయాణికులను ఇబ్బంది పెడుదోంది ప్రభుత్వం. అనేక చోట్ల ప్రయాణికులు అత్యంత ప్రమాదకరంగా ఫుట్‌పాత్‌ల వద్ద వేలాడుతూ కనిపిస్తున్నారు.
తీర్పు కనువిప్పుకావాలి
ఎక్కువ మంది ప్రయాణికులతో బస్సు నడపడం సేవా లోపమే అంటూ కాకినాడ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఈ నెల 22న ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. 2025 నవంబర్ 29న కాకినాడకు చెందిన ప్రయాణికుడు వాడపల్లి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ రద్దీ తట్టుకోలేక కరపలో దిగిపోయారు. అతడి ఇబ్బందిపై వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా వినియోగదారు టిక్కెట్టు మొత్తం రూ.85 తిరిగి చెల్లించాలని, సేవల్లో లోపం, మానసిక వేదనకు రూ.10 వేలు పరిహారం చెల్లించడంతో పాటు వ్యాజ్య ఖర్చులుగా రూ.5 వేలు వినియోగదారునికి చెల్లించాలని తీర్పు చెప్పారు.
వేలాడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులు
రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ
ఆర్టీసీ నిర్వహణలో అవకతవకలెన్నో
సగటు జీవి కష్టాలు పట్టని సంస్థ
వనరులు వృద్ధి చేయకుండానే
సీ్త్ర శక్తి పథకం అమలు
అధిక రద్దీతో మహిళల అవస్థలు
మిగిలిన బస్సులలో సర్దుకుపోతున్న
సాధారణ ప్రయాణికులు
ఇటీవల ఎక్కువవుతున్న ప్రమాదాలు
జీరో ప్రమాదాలు లక్ష్యంగా
తాజాగా సిబ్బందికి శిక్షణ
మహిళలకు తీవ్ర అవస్థలు
గురి చేస్తుంది
సీ్త్రశక్తి పథకం అశాసీ్త్రయంగా అమలు చేస్తూ మహిళలను తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నారు. ప్రయాణికులకు తగ్గట్టు బస్సులు ఏర్పాటు చేయకుండా వారి ప్రయాణాన్ని ప్రమాదకరంగా మార్చారు.
– కె.కృష్ణవేణి, సీఐటీయూ
రాష్ట్ర కమిటీ సభ్యురాలు, మండపేట


