● కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా
● డీఎస్సీ అవకతవకలపై లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్
రాజమహేంద్రవరం సిటీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ద్వారా అహంకారంతో తలకెక్కిన కళ్లను నేలకి దించుతారన్న సందేశాన్ని యువత దేశానికి అందించిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రాల లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా యువత పోరాట విజయమన్నారు. ఏపీలో డీఎస్సీ పరీక్షల అవకతవకలపై మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని రాజా డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలో యువత, నిరుద్యోగుల ఆగ్రహానికి లోకేష్ బలి కావాల్సి ఉంటుందన్నారు.


