గండేపల్లి: నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు వస్తువును దొంగలు చోరీ చేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కె.గోపాలపురానికి చెందిన బి.సావిత్రి తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా, శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని 32 గ్రాముల బంగారు వస్తువును అపహరించుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి సీఐ తిరుపతి చేరుకున్నారు. బాధితురాలిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్సై యూవీ శివనాగబాబు, సిబ్బంది ఉన్నారు.


