మొత్తం 56,43,719 28,19,226 28,24,493 5,581
ఫ దేశంలో పెరిగిపోతున్న జనాభా
ఫ వసతులు కరవై అవస్థలు
ఫ తగ్గిపోతున్న అడవులు
ఫ నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
ఆలమూరు: ఏ దేశ ప్రగతి అయినా అక్కడి జనాభా మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంఖ్యకు అనుగుణంగానే అభివృద్ధి జరుగుతుంది. ప్రస్తుతం మన దేశ జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. చైనాను అధిగమించి ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకుంది. దీని వల్ల అనేక నష్టాలు, కష్టాలు కలిగే అవకాశం ఉంది. శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
నియంత్రణతోనే భవిష్యత్తు
దేశంలో జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కృషి చేస్తేనే దేశ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రపంచ జనాభా ప్రస్తుతం 825.04 కోట్లు కాగా, మనదేశంలోనే 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. రాష్ట్ర జనాభా 5.35 కోట్లని అంచనా. కేంద్ర ప్రభుత్వం జనగణనను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభించింది. దానిలో భాగంగా తొలుత ఇళ్లు, ఆస్తుల వివరాలు నమోదు చేసుకుంది. అనంతరం 2027 ఫిబ్రవరి నుంచి జనగణన, కులగణనను ఒకేసారి చేపట్టేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. కాగా.. అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలపై ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
2011 గణాంకాల ప్రకారం..
జాతీయ జనాభా 2011 గణాంకాల ప్రకారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 51,54,296 మంది ఉండగా, వారిలో 25,69,888 మంది పురుషులు, 25,84,608 మంది సీ్త్రలు ఉన్నారు. అయితే 2025 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వం సుమారు 58.48 లక్షలుగా ఉంటుందని అంచనా వేసింది. ఉమ్మడి జిల్లాను పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ నాలుగున మూడు జిల్లాలుగా విభజించింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలు ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లాలో విలీనం కాగా, రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లాలో విలీనం చేసింది. దీంతో జనాభా గణాంకాల్లో తీవ్రమైన వ్యత్యాసం ఏర్పడింది. జిల్లాలో జనాభా లెక్కల ప్రకారం 2001 ప్రకారం 10.98 శాతంగా ఉన్న పెరుగుదల 2011కు వచ్చేసరికి 13.86 శాతంగా ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ జనాభా శాతం మరింతగా పెరిగి ఉండవచ్చుననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.
జనాభా వివరాలు
జిల్లా జనాభా పురుషులు మహిళలు విస్తీర్ణం
(కిలోమీటర్లు)
కోనసీమ 17,19,013 8,58,632 8,60,381 2,083
కాకినాడ 20,92,374 10,45,269 10,47,105 3,020
తూర్పు 18,32,332 9,15,325 9,17,007 2,561
గోదావరి
వనరుల కొరత
స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశ జనాభా కేవలం 35 కోట్లు కాగా 80 ఏళ్ల అనంతరం నాలుగు రెట్లకు చేరింది. పెరిగిపోతున్న జనాభా, తరిగిపోతున్న వనరులతో భవిష్యత్తు తరాలకు ప్రమాదం పొంచిఉంది. అధిక జనాభా కారణంగా అడవులు సైతం అంతరించిపోతున్నాయి. పంట పొలాలు ఆవాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణంలో సమతుల్యత లోపించి వర్షాలు తగ్గిపోయాయి. తద్వారా ఉన్న పొలాలకు కూడా భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడుతుంది. 1987 జూలై 11న ప్రపంచ జనాభా ఐదు మిలియన్లకు చేరడంతో ఐక్యరాజ్య సమితి ఆ రోజును ప్రపంచ జనాభా దినోత్సవంగా గుర్తించింది.


