నిడదవోలు రూరల్: రాష్ట్రస్థాయి మోడరన్ పెంటాథాన్ పోటీలకు తాడిమళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్‌ఎం సీహెచ్ పద్మ తెలిపారు. ఆమె శుక్రవారం మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ఎంపిక పోటీల్లో తమ విద్యార్థులు పి.మురళీ, బి.ప్రేమ్‌కుమార్, పి.దేవమౌళి, శ్రావణి, నాగదుర్గ, గ్రీష్మ, శివదుర్గ ప్రతిభ చూపారన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి ఏలూరులో జరిగే రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. ఎంపికైన క్రీడాకారులను, పీడీ బి.ప్రదీప్‌ను ఎంపీపీ తిరుమళ్ల భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూరిబాబు తదితరులు అభినందించారు.


