సుదీర్ఘ పరిశోధనకు పట్టం | - | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ పరిశోధనకు పట్టం

Mar 8 2026 7:48 AM | Updated on Mar 8 2026 7:48 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఏం చేయాలో తెలియదు. ఆ నొప్పిని నివారించేందుకు ఆ సమయంలో బీపీ తగ్గిపోవాలి. అది వెంటనే జరగాలి. అలా జరగాలంటే దానికి సంబంధించిన మందు వెంటనే నోటిలో బుగ్గకు పెడితే సెకన్లలో ఆ మందు లోపలకు వెళ్లి బీపీ అదుపులోకి వస్తుంది. అటువంటి మందుపై పరిశోధనలు చేసి విజయం సాధించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డ్రగ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) డి.నాగమణి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా వర్తనాపల్లి గ్రామానికి చెందిన నాగమణి సాధారణ ఏపీ రెసిడెన్షియల్‌ స్కూలు, చోడవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుకున్నారు. ఆమె ప్రతిభకు ఔషధ నియంత్రణ శాఖలో ఉద్యోగం వచ్చింది. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పలు జిల్లాల్లో పని చేసి, అంచెలంచెలుగా ఏడీగా ఎదిగారు. నిరంతరం తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తూనే పరిశోధనలపై వైపు దృష్టి సారించారు. 2016లో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో రీసెర్చ్‌ స్కాలర్‌గా చేరారు. ‘డిజైన్‌, ఫ్యాబ్రికేషన్‌ అండ్‌ ఎవల్యూషన్‌ ఆఫ్‌ బల్క్‌ డ్రగ్స్‌ డెలివరీ సిస్టమ్‌ ఆఫ్‌ సెలక్టెడ్‌ డ్రగ్స్‌’ అనే అంశంపై యూనివర్సిటీ ఫార్మసీ విభాగం ప్రొఫెసర్‌ వై.ఇందిరా ముజిజ్‌ నేతృత్వంలో పరిశోధనలు చేశారు. పరిశోధనల అనంతరం తాను తయారు చేసిన మందును ముందుగా కుందేళ్లపై ప్రయోగించి, పరీక్షించారు. ఆ పరీక్షలు విజయవంతమయ్యార ుు. జనవరి 24న యూనివర్సిటీ కమిటీ సమావేశం నిర్వహించి, ఆమె పరిశోధనలను పరిశీలించి, ఫార్మసీ పీహెచ్‌డీ ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నాగమణికి యూనివర్సిటీలో శనివారం పీహెచ్‌డీ ప్రదానం చేశారు. నాగమణి తూర్పు గోదావరితో పాటు కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో చేసిన సేవలకు గాను బెస్ట్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, బెస్ట్‌ డ్రగ్స్‌ ఏడీగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు.

ఫ హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ముందు దానిని నివారించే చూయింగ్‌ టాబ్లెట్‌ తయారీ

ఫ కుందేళ్లపై పరీక్షలు విజయవంతం

ఫ డాక్టరేట్‌ అందుకున్న

రాజమహేంద్రవరం డ్రగ్స్‌ ఏడీ నాగమణి

కుటుంబ సహకారంతోనే..

ఫార్మసీలో పీహెచ్‌డీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో రాష్ట్రంలోనే ఔషధ నియంత్రణ శాఖ నుంచి ఏకై క మహిళను అయినందుకు సంతోషంగా ఉంది. గుండె నొప్పి సమయంలో వెంటనే ఉపయోగించే విధంగా, తక్షణమే ఉపశమనం కలిగే విధంగా తయారు చేసిన మందు విజయం సాధించింది. ఇది నాకెంతో గర్వకారణం. ఇది నా ఒక్కరి విజయం కాదు. నా వెనుక ఉండి, నన్ను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులందరిదీ.

– డి.నాగమణి, డ్రగ్స్‌ ఏడీ,

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement