15 నుంచి రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు | - | Sakshi
Sakshi News home page

15 నుంచి రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు

Mar 8 2026 7:48 AM | Updated on Mar 8 2026 7:48 AM

నల్లజర్ల: మాస్టర్స్‌ చెస్‌ అకాడమీ, ఆంధ్ర చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి రాష్ట్ర స్థాయి ఓపెన్‌ రాపిడ్‌ చదరంగం పోటీలు జరుగుతాయని టోర్నమెంట్‌ కమిటీ కన్వీనర్‌ ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. శనివారం నల్లజర్లలోని కింగ్స్‌ ఉడ్‌ స్కూల్‌లో పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను జెడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు ఆవిష్కరించారు. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఈ పోటీలకు రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 300 మంది చెస్‌ క్రీడాకారులు హాజరవుతారన్నారు.

పాల్గొనే క్రీడాకారులు ఏపీచెస్‌.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 94408 67370, 89787 82501 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కింగ్స్‌ ఉడ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ చైర్మన్‌ దాపర్తి శివ, సెక్రటరీ, కరస్పాండెంట్‌ నిఖిలదేవి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సాయికుమార్‌, సొసైటీ అధ్యక్షులు రావూరి వెంకటరమణ, మార్ని దుర్గారావు, సవలం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement