గుదిబండలు | - | Sakshi
Sakshi News home page

గుదిబండలు

Mar 5 2026 7:35 AM | Updated on Mar 5 2026 7:35 AM

కూలి కూడా రావడం లేదు

ప్రస్తుతం సర్వే రాళ్లకు డిమాండ్‌ బాగా తగ్గిపోయింది. రెండేళ్లుగా మాకు వ్యాపారం సాగడం లేదు. కూలి డబ్బులు కూడా రావడం లేదు. 1.5 అడుగుల రాయి తయారు చేసినందుకు కార్మికుడికి రూ.25 ఇవ్వాలి. మరో వైపు క్వారీలో బండల ఖరీదు పెరిగింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి. అమ్మకాలు లేక ఎక్కడ రాళ్లు అక్కడే ఉండిపోయాయి. దుద్దుకూరు సర్వే రాళ్లు నాణ్యతగా ఉండడం వల్ల ఎక్కువగా కొనుగోలు చేస్తారు. గత ప్రభుత్వంలో వ్యాపారం లాభసాటిగా ఉండేది. తయారైన రాళ్లు ఎప్పటికప్పుడు అమ్ముడుపోయేవి.

– షేక్‌ బాజీ, సర్వే రాళ్ల తయారీ దారుడు, దుద్దుకూరు, దేవరపల్లి మండలం

సర్వే రాళ్లను తయారు చేస్తున్న కార్మికుడు

దేవరపల్లి: పొలాలు, ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసినప్పడు అందరికీ టక్కున గుర్తుకు వచ్చేవి సర్వే రాళ్లు. భూమిని కొలతలు కొలిచి, సరిహద్దులను గుర్తించి, అక్కడ ఈ రాళ్లను పాతిపెడతారు. ఇక భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినప్పుడు హద్దులను నిర్ధారించడానికి ఇవి ఎంతో కీలకంగా ఉంటాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన రాళ్లను తయారు చేసే కార్మికుల జీవితాలు అధ్వానంగా ఉన్నాయి. చంద్రబాబు పాలనలో రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడంతో రాళ్లకు డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో అవి కార్మికులకు గుదిబండలుగా మారాయి.

కష్టం ఎక్కువే

కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంది సర్వే రాళ్ల తయారీ కార్మికుల పరిస్థితి. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని నల్లరాతి బండలను చెక్కి సర్వే రాళ్లను తయారు చేస్తారు. పొలాలు, ఇళ్ల స్థలాల సరిహద్దుల్లో పాతడానికి నల్లరాతి సర్వే రాళ్లను ఎక్కువగా వినియోగిస్తారు. 1.5 అడుగులు, 2 అడుగులు, 2.5 అడుగులు, 3 అడుగల పొడవైన రాళ్లను సరిహద్దు రాళ్లుగా వినియోగిస్తారు. పొడవును బట్టి రాయి ధర ఉంటుంది. ఒక్కొక్క రాయి రూ. 40 నుంచి 100 పలుకుతుంది. కానీ దాదాపు రెండేళ్లుగా గిరాకీ లేకపోవడంతో ఎక్కడ రాళ్లు అక్కడే పడి ఉన్నాయి.

దుద్దుకూరులో తయారీ

దేవరపల్లి మండలం దుద్దుకూరులో సర్వే రాళ్లు తయారు చేస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాలుగా ఈ పనిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. బందపురం శివారు రంగరాయ కాలనీ వద్ద సర్వే రాళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. కొవ్వూరు మండలం దేచర్ల రెవెన్యూ పరిధిలోని ఆర్లమ్మ క్వారీ, లక్ష్మీపురం క్వారీల నుంచి పెద్ద నల్లరాతి బండలను తీసుకు వచ్చి, వాటిని కార్మికులు సర్వే రాళ్లు తయారు చేస్తారు. ఒక లారీ బండలు సుమారు రూ.పది వేలు ఉండగా, వాటితో దాదాపు 500 రాళ్లు తయారు చేస్తారు. రాళ్ల తయారీకి సుమారు రూ.12,500 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం రాళ్ల తయారీ గిట్టుబాటు కాకపోయినా, తాతల నాటి నుంచి వృత్తిగా వస్తున్నందున దీన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. ఒకప్పుడు సుమారు 100 కుటుంబాలు రాళ్లు తయారు చేస్తూ జీవనం సాగించేవి. వ్యాపారం గిట్టుబాటు కాకపోవడంతో చాలామంది వేరే పనులకు మారిపోయారు. ప్రస్తుతం 20 కుటుంబాలు రాళ్లు తయారు చేసి విక్రయాలు చేస్తున్నాయి.

ఉత్తరాంధ్ర జిల్లాలకు సరఫరా

ఇక్కడ తయారు చేసిన సర్వే రాళ్లను ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, నర్సీపట్నం, తుని, విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగుంటే సర్వే రాళ్లుకూ గిరాకీ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లోని బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సర్వే రాళ్లను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం లేకపోవడంతో రాళ్లకు డిమాండ్‌ తగ్గిందని తయారీదారులు చెబుతున్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో లాభాలు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సర్వే పనులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎక్కువగా జరగడంతో సర్వే రాళ్లకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఆ సమయంలో వారానికి ఇక్కడ నుంచి సుమారు 3 వేల రాళ్లు సరఫరా చేసేవారు. రాయి ఖరీదు లాభసాటిగా ఉండేది. రూ.150 నుంచి 200 ధరకు అమ్ముడు పోయేవి. అనంతరం రెండేళ్లుగా కొనుగోళ్లు లేక ఎక్కడ రాళ్లు అక్కడే ఉండిపోయాయి. అక్కడక్కడ భూముల రీసర్వే జరగడం, స్థానికంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతున్నందున రాళ్లు కొనుగోలు చాలా తక్కువగా ఉంటోంది.

ఫ గిట్టుబాటు కాని సర్వే రాళ్ల తయారీ

ఫ కష్టం ఎక్కువ, లాభం తక్కువ

ఫ బండలు కొని

రాళ్లుగా చెక్కుతున్న కార్మికులు

ఫ గుట్టలుగా పేరుకుపోతున్న సరకు

ఫ చంద్రబాబు పాలనలో

పడిపోయిన రియల్‌ ఎస్టేట్‌

ఫ తగ్గిపోయిన

సరిహద్దు రాళ్ల వినియోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement