వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు బుధవారం తాడేపల్లి కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతం, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, రాజమమహేంద్రవరం సిటీ ప్రచార విభాగం అధ్యక్షుడు పెద్దిరెడ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
– రాజమహేంద్రవరం సిటీ


