బడ్జెట్ అధికమైనా తప్పదు
ఏ శుభకార్యమైనా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఏసీ కల్యాణ మండపాల్లోనే నిర్వహిస్తున్నాం. ఇటీవల మా మనమరాలి ఓణీ ఫంక్షన్‌ను ఏసీ కల్యాణ మండపంలోనే నిర్వహించాం. ఒకప్పటి పరిస్థితికి, నేటి పరిస్థితికి చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా శుభకార్యాలు చేయాల్సిందే.
–ద్విభాష్యం విజయప్రభాకర్,
విశ్రాంత ఉద్యోగి, రాజమహేంద్రవరం
ఇళ్ల వద్ద నిర్వహించే
పరిస్థితి లేదు
ఏ కార్యక్రమమైనా ఇళ్ల వద్ద నిర్వహించే పరిస్థితి లేదు. చిన్న, మధ్య తరగతి కుటుంబాలు కూడా ఆర్థిక పరిస్థితిని వెరవకుండా ఏసీ కల్యాణ మండపాల్లోనే నిర్వహిస్తున్నారు. నాన్ ఏసీ అయితే ఏసీ కా దా.. అంటూ వచ్చిన వారు పెదవి విరుస్తున్నారు.
–కొప్పిశెట్టి శ్రీనివాస్, వ్యాపారి,
రాజమహేంద్రవరం
డిమాండ్ ఎక్కువగానే ఉంది
గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్యాణ మండపాలకు డిమాండ్ అధికంగానే ఉంది. రైస్ మిల్లును కల్యాణ మండపంగా మార్చాం. ముహూర్తాల సమయంలో డిమాండ్ మరింత అధికంగా ఉంటుంది. రెండు, మూడు నెలల ముందుగానే కల్యాణ మండపాన్ని బుక్ చేసుకుంటున్నారు.
–మూర్తినీడి వెంకటరాజు, కల్యాణ మండపం నిర్వాహకుడు, రాయవరం
బడ్జెట్ అధికమైనా తప్పదు
బడ్జెట్ అధికమైనా తప్పదు


