రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఖోఖో వుమెన్ ఇంటర్ కాలేజీయేట్ కం చాంపియన్ షిప్ అండ్ యూనివర్సిటీ టీమ్ సెలెక్షన్స్ గురువారం జరిగాయి. గోదావరి జిల్లాలోని అనుబంధ కాలేజీల నుంచి 16 జట్లు, 240 మంది క్రీడాకారుల మధ్య పోటీ రసవత్తరంగా జరిగింది. ఈ పోటీలో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా ద్వితీయ స్థానంలో గొల్లల మామిడాడలోని డీఆర్ రెడ్డి కళాశాల, తృతీయ స్థానంలో ఏలూరులోని సెయింట్ థెరిసా కళాశాల జట్లు నిలిచాయని రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి తెలిపారు. వీరి నుంచి యూనివర్సిటీ టీమ్‌ని ఎంపిక చేసి, కర్ణాటకలోని దేవాంగరే యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీలకు పంపిస్తామన్నారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి.విజయనిర్మల, సెక్రటరీ డాక్టర్ ఎంవీవీఎంయూ ఫణీంద్ర, పరిశీలకులు డాక్టర్ ప్రమీలారాణి, సెలెక్షన్ కమిటీ సభ్యులు ధర్మేంద్ర, పట్టాభి పాల్గొన్నారు.
ప్రథమ స్థానంలో నిలిచిన
రాజమండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల


