12 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్‌లలో పనిచేస్తున్న 1989 బ్యాచ్‌కు చెందిన 12మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి లభించింది. డి. సమర్పణరావు, డి. పోలరాజు, యూవీవీ సత్యనారాయణ, కేవీవీసత్యనారాయణ, పీవీ సింహాచలం, వై. శ్రీనివాస్, ఏ నాగేశ్వరరావు, వి వి వి సత్యనారాయణ, ఎం వి ఎస్ ఆర్ నాయుడు, ఏంవీ వెంకటేశ్వరరావు, ఎస్ కే ఎఫ్ రెహమాన్, ఎస్ నాగేశ్వరరావు, సబ్ ఇన్‌సెక్టర్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా సోమవారం వారు జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి రెండవ స్టార్‌ను అలంకరించి, శుభాకాంక్షలు తెలిపారు.
నేడు పొగాకు రైతుల ర్యాలీ
సిగరెట్లపై పెంచిన జీఎస్టీ
తగ్గించాలని డిమాండ్
దేవరపల్లి: సిగరెట్లపై జీఎస్టీని 28 నుంచి 40 శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం దేవరపల్లిలో పొగాకు రైతులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు పొగాకు వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో పంట సాగు చేస్తున్న రై తులు ఉదయం 9 గంటలకు దేవరపల్లి వేలం కేంద్రానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక టుబాకో బోర్డు కార్యాలయం నుంచి మూడు రో డ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ ధ ర్నా, మానవహారం నిర్వహించి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు తమ నిరసన తెలియజేయనున్నట్టు ఆయన చెప్పారు. సిగరెట్లపై జీఎస్టీని పెంచడం వల్ల మన పొగాకు ఉత్పత్తిపై ప్రభావం ప డుతుందని ఆయన చెప్పారు. సిగరెట్లపై జీఎస్టీని పెంచ వద్దని గతంలో పొగాకు బోర్డు అధికారు లు, రాజమహేంద్రవరం, ఏలూరు ఎంపీల ద్వా రా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసినట్టు ఆయన చెప్పారు.
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
రాజమహేంద్రవరం సిటీ: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రాంతం నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్‌ఎన్ మూర్తి సోమవారం ప్రకటించారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకూ హైదరాబాద్ నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం 31 స్పెషల్ బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి 36 షెడ్యూల్ బస్సులతో పాటు 10 స్పెషల్ బస్సులు (రాజమహేంద్రవరం డిపో – 7, కొవ్వూరు డిపో – 2, నిడదవోలు డిపో – 1) అదనపు చార్జీలు లేకుండా సాధారణ చార్జీలతో నడపనున్నట్లు తెలిపారు. విజయవాడ వైపు 17 షెడ్యూల్ బస్సులు, విశాఖపట్నం వైపు 14 షెడ్యూల్ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా మరిన్ని అదనపు బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు మూర్తి తెలిపారు.


