సఖినేటిపల్లి లాకుల వద్ద...
సఖినేటిపల్లి: పి.గన్నవరం ప్రధాన పంట కాలువలో పడి గొందికి చెందిన కొల్లాబత్తుల కుటుంబరావు (65) మృతి చెందాడు. శుక్రవారం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు అంతా గాలించినా ఆచూకీ లభించలేదు. సఖినేటిపల్లి గ్రామీణ బ్యాంకు వద్ద అతడి సైకిల్ ఉండడంతో పొరపాటున పంట కాలువ వైపునకు వెళ్లి కాలువలోకి జారి పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఈ మేరకు పి.గన్నవరం ప్రధాన పంట కాలువ పొడవునా వెతకగా ఆదివారం సఖినేటిపల్లి లాకుల వద్ద అతని మృతదేహం గుర్తించారు. ఈ మేరకు సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


