నేటి నుంచి రహదారి భద్రతా మాసోత్సవాలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజలు, వాహనదారుల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని అధికారులను కలెక్టర్ కీర్తి ఆదేశించారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా సడక్ సురక్షా అభియాన్ పోస్టర్‌ను కలెక్టరేట్‌లో గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పరిమితికి మించి లోడింగ్ చేయడం వల్ల ఇసుక రోడ్లపై పడి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇసుక అధిక లోడింగ్ జరగకుండా క్షుణ్ణంగా పర్యవేక్షించాలని రవాణా అధికారులను ఆదేశించారు. హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ తప్పనిసరి, మద్యం తాగి వాహనాలు నడపరాదు వంటి అంశాలపై వాహనదారులకు కచ్చితమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ మాట్లాడుతూ, ఈ నెల 31వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నామని తెలిపారు.
జిల్లా వ్యవసాయ
అధికారిగా రాబర్ట్ పాల్
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా వ్యవసాయ అధికారిగా కె.రాబర్ట్ పాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈ స్థానంలో ఉన్న మాధవరావు బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. పాల్ ఉమ్మడి జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ మేనేజర్‌గా వ్యవహరిస్తూ, ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయ అధికారిగా నియమితులయ్యారు. ఆయనకు రాజమహేంద్రవరం ఏడీఏ సూర్యరమేష్, ఏఈఓ సంఘం అధ్యక్షుడు వేణుమాధవ్, పలువురు వ్యవసాయ అధికారులు అభినందనలు తెలిపారు.
నేటి నుంచి రహదారి భద్రతా మాసోత్సవాలు


