‘యుద్ధం.. కుక్కల కొట్లాట వంటిది’ | - | Sakshi
Sakshi News home page

‘యుద్ధం.. కుక్కల కొట్లాట వంటిది’

Dec 31 2025 7:26 AM | Updated on Dec 31 2025 7:26 AM

‘యుద్ధం.. కుక్కల కొట్లాట వంటిది’

‘యుద్ధం.. కుక్కల కొట్లాట వంటిది’

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూర ల్‌): యుద్ధం అంటే మాంసం కోసం కుక్క ల కొట్లాట వంటిదంటూ కృష్ణుడికి ధర్మ రాజు విన్నవించుకుంటాడని సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఆయన మంగళవారం ఉద్యోగ పర్వంలోని పలు అంశాలను వివరించా రు. ‘‘తమ తరఫున ద్యూత కార్యం నిర్వహించాల్సింది గా సోదరులు, భార్యతో కలసి కృష్ణ పరమాత్మకు ధర్మ రాజు విన్నవించుకుంటాడు. అయితే, రాజ్యం కోల్పో యి సంపాదించుకునే శాంతి మరణంతో సమానమని అంటాడు. కనీసం ఐదు ఊళ్లు ఇవ్వాలని అడిగాం. కానీ, మేం యుద్ధానికి భయపడ్డామని దుర్యోధనుడు భావించి, దానికి కూడా సిద్ధపడటం లేదు. క్షత్రియ వంశం నాశనం కాకూడదని భావించి, మేము ఐదు ఊళ్లు ఇవ్వాలని అడుగుతున్నాం. కృష్ణా, మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించడానికి నీవు తప్ప మరొకరు లేరు’’ అని ధర్మరాజు అంటాడని చెప్పారు. ఈ మాట ల్లో శరణాగతి కనపడుతోందని, ఇలా ప్రతివారూ భగవంతుడిని ప్రార్థించాలని అన్నారు. కర్ణ దుర్యోధనుల ది ఆదర్శ మైత్రి కాదని, అవసరార్థం మైత్రి అని చెప్పారు. ‘‘అర్జునుడిని ఎదు ర్కొంటాడని భావించే కర్ణుడిని దుర్యోధనుడు చేరదీశాడు. అర్జునుడిని నిగ్రహించడానికి రాజాశ్రయం కావాలనే త లంపుతో దుర్యోధనుడి అండ చేరాడు క ర్ణుడు. సినిమాలో చూపినట్లు వీరు ఆద ర్శ స్నేహితులు కారు’’ అని సామవేదం వివరించారు. కులవివక్ష లేని నాటి కాలాన్ని కుల విద్వేషంతో నేడు కొందరు విమర్శిస్తున్నారని, సంజయుడు, విదురుడు ఏ కులానికి చెందిన వారైనా, వారిని ‘రాజర్షి’ అని, మహాప్రాజ్ఞ అని ధృతరాష్ట్రుడు సంబోధించడాన్ని గమనించాలని చెప్పారు. కృష్ణుడు ద్యూత కార్యానికి వస్తున్నాడన్న వార్త సంజయుని ద్వా రా విన్న ధృతరాష్ట్రుడు ‘కళ్లున్న వారు ఎంత అదష్టవంతులు’ అని ఆవేదన చెందుతాడని, పరమాత్మ మీద దృష్టి లేని వారందరూ అంధులేనని సామవేదం అన్నా రు. ‘ధృతరాష్ట్రునిలో రెండు ప్రవృత్తులున్నాయి. అంతఃకరణంలోని జీవుడొకరు, ఇంద్రియాలను అంటిపెట్టుకున్నది మరొకరు. ఇటువంటి స్వభావం అనేక మందిలో ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement