
ఆహార ఉత్పత్తులపై మిల్‌సి ఇండియా, ఐసీఏఆర్–నిర్కా ఒప్పంద
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): నూతన విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల అభివృద్ధి దిశగా జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్–నిర్కా), హైదరాబాద్‌కు చెందిన మిల్‌సి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ మంగళవారం వెల్లడించారు. రైతు ఆదాయాన్ని పెంపొందించి, పంటలకు మెరుగైన ధరలు లభించాలంటే వ్యవసాయ ఉత్పత్తుల్లో విలువ జోడింపు చాలా ముఖ్యమన్నారు. ఇందులో భాగంగానే ఐసీఏఆర్–నిర్కా, మిల్‌సి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. ఆయనతో పాటు, మిల్‌సి ఇండియా వ్యవస్థాపకుడు వజ్జరపు శ్యాంబాబు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా పసుపు, మిర్చి, అశ్వగంధతో పాటు, చక్కెర, మైదా రహిత చిరుధాన్యాల ఆధారిత ఆహార పదార్థాలను శాసీ్త్రయంగా అభివృద్ధి చేసి, మరింత చేరువ చేయనున్నామని వారన్నారు. అధికంగా రిఫైన్ చేసిన మైదా, చక్కెరతో తయారయ్యే ఫాస్ట్‌ఫుడ్‌లకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు కానున్నాయన్నారు. ఈ ఒప్పందం పోషకవంతమైన, స్థిరమైన, మార్కెట్ కేంద్రిత ఉత్పత్తుల వైపు ప్రధాన ముందడుగుగా నిలిచి, రైతులు, వినియోగదారులకు లాభం చేకూరుస్తుందన్నారు. చిరుధాన్యాల ఆధారిత ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులను ప్రామాణీకరించి, కో–బ్రాండింగ్ చేసి, వచ్చే రెండు నెలల్లో మార్కెట్లోకి తెస్తామని డాక్టర్ శేషుమాధవ్ తెలిపారు.