
స్కూల్ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
అమలాపురం టౌన్: పట్టణంలోని ఈదరపల్లి వంతెనపై నుంచి విద్యార్థులతో వస్తున్న నారాయణ విద్యాసంస్థల బస్సుకు మంగళవారం ఉదయం త్రుటిలో ప్రమాదం తప్పింది. అంబాజీపేట వైపు నుంచి విద్యార్థులను ఎక్కించుకుని అమలాపురానికి ఈ బస్సువస్తోంది. ఆ సమయంలో వెనుక చక్రం ఊడిపోవడాన్ని వంతెనపై ఉన్న జట్టు కార్మికులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. చక్రం ఊడి పోవడంతో తక్షణమే బస్సును ఆపి, దానిలోని విద్యార్థులను కిందకు దింపాడు. తిరిగి చక్రాన్ని అమర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల అమలాపురం విద్యానిధి విద్యా సంస్థలకు చెందిన బస్సుకు కూడా త్రుటిలో ప్రమాదం తప్పింది.
జాతీయ రిఫరీగా అంజి
అమలాపురం టౌన్: హైదరాబాద్‌లోని ఉర్దూ మాస్కన్ హాల్లో ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు తెలంగాణ జు–జిట్సు (యుద్ధ కళ) అసోసియేషన్ నిర్వహించిన నేషనల్ రిఫరీ, కోచ్ సెమినార్‌లో అమలాపురానికి చెందిన పడాల అంజి జాతీయ రిఫరీగా ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు ఆయన అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి జు–జిట్సు చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు. అలాగే జాతీయ రిఫరీగా ఉత్తీర్ణులైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని జు–జిట్సు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ యాసిన్, ప్రధాన కార్యదిర్శి ఎన్.గురుప్రభాకరరావు చేతుల మీదుగా అందుకున్నారు.

జాతీయ రిఫరీగా అంజి