రాజానగరం: విద్యార్థులకు చదువుతో పాటు, క్రీడలూ అవసరమని దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్ విద్యా నికేతన్ కరస్పాండెంట్ సీహెచ్ విజయప్రకాష్ అన్నారు. పాఠశాల మైదానంలో నాలుగు రోజులుగా జరుగుతున్న సీబీఎస్‌ఈ సౌత్ జోన్–1 హ్యాండ్ బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.
విజేతలు వీరే..
అండర్–14 విభాగంలో డాల్ఫిన్ ఎలైట్ స్కూల్ (చైన్నె), వెలమలై విద్యాలయం వెస్ట్ (చైన్నె) ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. తృతీయ స్థానంలో శ్రీప్రకాష్ విద్యా నికేతన్ (పాయకరావుపేట), ఆర్‌జీఎం స్కూలు (నంద్యాల) నిలిచాయి. అండర్–17లో రాజాజీ విద్యాలయం (చైన్నె), కవి భారతి స్కూలు (చైన్నె) తొలి రెండు స్థానాల్లో, శ్రీవిద్యా నికేతన్ (తిరుపతి), భారతీయ విద్యా భవన్ (తాడేపల్లిగూడెం) తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. అండర్–19లో ఎస్‌వీఆర్ స్కూలు (చైన్నె), కికాని విద్యా మందిర్ (చైన్నె) వరుస స్థానాల్లో, శ్రీప్రకాష్ విద్యానికేతన్, వెల్లమల విద్యాలయం (విరగనూరు–చైన్నె) తృతీయ స్థానంలో నిలిచాయని టెక్నికల్ కమిటీ ఇన్‌చార్జి డాక్టర్ ఎస్.గోపీకృష్ణ వెల్లడించారు. స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.స్వామి, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, ప్రిన్సిపాల్ విమల, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.