
అమ్మ చెప్పిందని..
అమ్మా నాకు జాబ్ వస్తే నీకు ఏం కావాలో చెప్పు అని కొడుకు తల్లిని అడిగాడు. అప్పుడు ఆ తల్లి నాకేం వద్దు, నీ జీతంలో కొంత భాగాన్ని అభాగ్యులు, అనాథల కోసం, వారి వైద్యానికి ఖర్చు చేయమని చెప్పడంతో ఆ మాట నుంచే సాయం పుట్టుకొచ్చింది. తన తల్లికిచ్చిన మాట కోసం కేశవభట్ల చారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక వేల మంది నిరాశ్రయులకు కేశవభట్ల శ్రీనివాసరావు సేవలందిస్తున్నారు. వివిధ రూపాల్లో పేదలను ఆదుకుంటున్నారు.
సాయం చేస్తున్నాం
ఇప్పటికి వరకూ పేదవర్గాల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 5 లక్షల మందికి పైగా కంటి వైద్య పరీక్షలు చేయించాం. 76 వేల మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశాం. వెయ్యి మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించాం. అంతే కాకుండా రైల్వే కార్మికులకు ఉచితంగా బి య్యం ఇచ్చాం. దివ్యాంగులకు 820 ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలు అందించాం. ఆ తల్లి మాట కోసం సాయం చేస్తూనే ఉన్నా.
– కేశవభట్ల శ్రీనివాసరావు,
విశ్రాంత రైల్వే చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్

అమ్మ చెప్పిందని..