
ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్ట్
మూడు కిలోల గంజాయి స్వాధీనం
రాజోలు: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ నరేష్‌కుమార్ ఆదివారం తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన చవ్వాకుల నితీష్ అలియాస్ బంటి ఇంట్లో మూడు కిలోల గంజాయిని మలికిపురం ఎస్సై పీవీవీ సురేష్ గుర్తించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నితీష్‌తో పాటు, రాజమహేంద్రవరం గాజుల వీధికి చెందిన అమిటి ప్రశాంత్‌కుమార్, తాడి హరీష్‌బాబు(పడమటిపాలెం), కోరుకొండ మనోజ్(బట్టేలంక), భూపతి దిషోన్‌కుమార్(చింతలమోరి), గాడా శ్యాంసన్(కేశనపల్లి)ని అరెస్ట్ చేశారు. వీరిలో చవ్వాకుల నితీష్, అవిటి ప్రశాంత్‌కుమార్, తాడి హరీష్‌బాబుపై గతంలో మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌లో గంజాయి కేసు నమోదైంది. కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆదేశాల మేరకు రీ–విజిట్ కార్యక్రమంలో భాగంగా గంజాయి కేసుల్లో పాత నిందితులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్సై సురేష్‌కు వచ్చిన సమాచారంతో, గంజాయి విక్రయిస్తున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో.. చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. శ్రీఆపరేషన్ సేవ్ క్యాంపస్‌శ్రీ పేరుతో విద్యాసంస్థల్లో ఈగిల్ క్లబ్బులు ఏర్పాటు చేసి, శ్రీడ్రగ్స్ వద్దు బ్రోశ్రీ నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సీఐ నరేష్‌కుమార్ తెలిపారు.