
వైఎస్సార్ సీపీలో ముగ్గురికి పదవులు
రాజమహేంద్రవరం రూరల్/దేవరపల్లి: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ముగ్గురికి పార్టీలోని వివిధ విభాగాల్లో పదవులు దక్కాయి. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని పిడింగొయ్యి గ్రామానికి చెందిన రూరల్ మాజీ ఎంపీపీ రేలంగి వీరవెంకట సత్యనారాయణను పార్టీ రాష్ట్ర బీసీ విభాగ కార్యదర్శిగా నియమించారు. అలాగే కడియపులంక గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావును పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగంకార్యదర్శిగా నియమించారు. గోపాలపురం నియోజకవర్గంలోని గోపాలపురం మండలం సంజీవపురానికి చెందిన ఇళ్ల భాస్కరరావు రాష్ట్ర అతిరాస విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

వైఎస్సార్ సీపీలో ముగ్గురికి పదవులు

వైఎస్సార్ సీపీలో ముగ్గురికి పదవులు