
ఉత్సాహంగాహ్యాండ్ బాల్ పోటీలు
రాజానగరం: దివాన్ చెరువులోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్‌లో రెండు రోజులుగా జరుగుతున్న సీబీఎస్‌ఈ సౌత్ జోన్ –1 హ్యాండ్ బాల్ పోటీలలో క్రీడాకారులు హోరాహోరిగా తలపడుతున్నారు. దీనిలో భాగంగా శనివారం జరిగిన పోటీలలో అండర్ – 14 విభాగంలో చేరక్ ఇంటర్నేషనల్ (హైదరాబాద్), ఆర్‌జీఎం ఇంటర్నేషనల్ స్కూల్ (నంద్యాల), హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హైదరాబాద్), ఏకశిల హైస్కూల్, అలాగే అండర్ – 17 విభాగంలో రైల్వే హయ్యర్ సెకండరీ స్కూల్ (మధురై), వెలమలై విద్యాలయం (చైన్నె), అండర్– 19 విభాగంలో వెలమలై విద్యాలయం (చైన్నె) విద్యార్థులు విజయం సాధించారు. పోటీలకు డాక్టర్ ఎస్.గోపికృష్ణ రిఫరీగా వ్యవహరించారు. సోమవారం వరకు జరిగే ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ నుంచి 1200 మంది క్రీడాకారులు, 120 మంది కోచ్‌లు, మేనేజర్లు హాజరయ్యారని స్పోర్ట్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.స్వామి తెలిపారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ విజయ ప్రకాష్, ప్రిన్సిపాల్ విమల, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కూలీలపై అడవి పంది దాడి
ఐ.పోలవరం: గ్రామ పరిధిలోని పొలాల్లో పనిచేస్తున్న కూలీలపై శనివారం అడవి పంది దాడి చేసింది. ఈ ఘటనలో దంగుడుబియ్యం రాజారావు, గుత్తుల త్రివేణి పద్మావతి, బొలిశెట్టి రాంబాబు, దంగేటి వెంకట్రావుకు గాయాలయ్యాయి. వారిని టి.కొత్తపల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వీరిలో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
గోపాలపురం: ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై పి.మనోహర్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గంగోలు పంచాయతీ పరిఽఽధిలోని రాంపాలెంకి చెందిన ఏసులంక బుల్లి వెంకన్న (39) తన పొలానికి వెళ్లే క్రమంలో బాలింక చెరు వు దాటుతూ ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో చెరువు లో మునిగి చనిపోయా డు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఉత్సాహంగాహ్యాండ్ బాల్ పోటీలు

ఉత్సాహంగాహ్యాండ్ బాల్ పోటీలు