
స్వదేశానికి దుబాయ్ బాధితుడు
● ఏజెంట్ మోసంతో అంబాజీపేట వాసి
అవస్థలు
● ఇండియాకు తీసుకువచ్చిన కోనసీమ
సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు
అమలాపురం రూరల్: నకిలీ ఏజెంట్ మోసంతో దుబాయ్‌లో ఇబ్బందులు పడుతున్న అంబాజీపేట చెందిన ఒక యువకుడిని భారత విదేశీయ రాయబార మంత్రిత్వ శాఖ సహకారంతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అఽధికారులు ఇండియాకు తీసుకునివచ్చారు. వివరాల్లోకి వెళితే.. అంబాజీపేట చెందిన పొన్నాడ మంగ కుమారుడు కనకరాజును ఒక ఏజెంట్ ఇటీవల దుబాయ్‌కు పంపించాడు. అక్కడ నెలకు రూ.50 వేలకు పైగా జీతం వస్తుందని, రోజుకు 8 గంటలు పని ఉంటుందని చెప్పాడు. కానీ అక్కడ కనకరాజుకు భిన్నమైన పరిస్థితులు ఎదుర య్యాయి. అధిక పని గంటలు, తీవ్రమైన ఒత్తిడితో పాటు జీతం తక్కువగా ఇవ్వడంతో ఇబ్బంది పడ్డాడు. ఈ విషయాన్ని తన తల్లి మంగకు ఫోన్‌లో తెలియజేశా డు. దీంతో ఆమె కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను ఆశ్రయించింది. తన కుమారుడిని దుబాయ్ నుంచి ఇండియాకు రప్పించాలని కోరింది. అలాగే కలెక్టర్ మహేష్ కుమార్‌కు కూడా ఫిర్యాదు చేయడంతో ఆయన డీఆర్‌ఓ కేంద్రం నోడల్ అధికారి మాధవికి ఆదేశాలు జారీ చేశారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు బాధితుడిని సంప్రదించి, అక్కడి సమస్యను తెలుసుకున్నారు. కనకరాజు ఇబ్బందులు పడుతున్నాడని తెలియడంతో ఇండియాకు తీసుకువచ్చారు.