
మెరిట్ లిస్ట్ కోసం చూస్తున్నా
ముమ్మిడివరం మండలం మల్లయ్యపాలెం ఎంపీపీ స్కూల్లో ఎస్‌జీటీ పనిచేస్తూ డీఎస్సీ 2025 పరీక్షలో ఫిజికల్ సైన్స్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 82 మార్కులు సాధించాను. ఆన్‌లైన్‌లో స్కోర్ కార్డు పొందాను. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. – బి.శివ గణేష్, ఎస్‌జీటీ, ద్రాక్షారామం,
రామచంద్రపురం మండలం
మంచి ర్యాంకు సాధించాను
తెలంగాణ డీఎస్సీ 2024లో పరీక్ష రాసి మిర్యాలగూడలో ఎస్‌జీటీగా పనిచేస్తున్నాను. డీఎస్సీ 2025 పరీక్షల్లో ఎస్‌జీటీ విభాగంలో 87.7 మార్కులు సాధించాను. మెరిట్ జాబితా కోసం ఎదురు చూస్తున్నాను. మా నాన్న మట్టపర్తి వెంకట రాంబాబు కొత్తలంక మోడల్ ప్రైమరీలో పీఎస్ హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. నాన్న స్ఫూర్తితో ఉద్యోగం సాధించాను.
– మట్టపర్తి సౌమ్య, ముమ్మిడివరం
త్వరగా ప్రకటించాలి
డీఎస్సీ 2025 పరీక్షలో ఎస్‌జీటీ విభాగంలో 87.2 మార్కులు సాధించాను. రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను టీచర్ కొలువు సాధించాలనే పట్టుదలతో చదివాను. మెరిట్ జాబితా కోసం వేచి చూస్తున్నాను. అధికారులు మెరిట్ జాబితాను ప్రకటించాలి.
– బద్రి అంజలి దేవిక, అండ్రంగి, కాజులూరు మండలం

మెరిట్ లిస్ట్ కోసం చూస్తున్నా

మెరిట్ లిస్ట్ కోసం చూస్తున్నా