
అధిక భారం
విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను రాసేందుకు అసెస్‌మెంట్ బుక్‌లెట్లను వినియోగిస్తున్నారు. ఇది ఉపాధ్యాయులకు భారంగా ఉంది. బోధనకు కూడా సమయం సరిపోవడం లేదు. పూర్వపు పద్ధతిలోనే పేపరుపై జవాబులు రాసే విధానాన్ని అమలు చేయాలి.
– పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు,
యూటీఎఫ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
వ్యతిరేకిస్తున్నాం
ఉపాధ్యాయులకు పనిభారం పెంచేందుకే అన్నట్లుగా అసెస్‌మెంట్ బుక్‌లెట్లు ఉన్నాయి. పరీక్షా పత్రాలు కూడా విద్యార్థుల స్థాయికి మించి ఉన్నాయి. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని అసెస్‌మెంట్ బుక్‌లెట్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తాం.
– పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు,
ఎస్‌టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఉపాధ్యాయులకే పరీక్ష
పరీక్షల విధానంలో కొత్తగా తీసుకుని వచ్చిన మూల్యాంకన విధానం ఉపాధ్యాయులకే పరీక్షలా ఉంది. ఉపాధ్యాయులపై తీవ్రమైన పనిభారం పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలే మేలు అన్నట్లుగా ఉంది. దీన్ని మా సంఘం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
– పి.నరేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆపస్ ఉపాధ్యాయ సంఘం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

అధిక భారం

అధిక భారం