
వెయిట్ లిఫ్టింగ్ కోనసీమ జట్టు ఎంపిక
అమలాపురం టౌన్: డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక హెల్త్ అండ్ ఫిట్‌నెస్ జిమ్‌లో సోమవారం 11 మంది వెయిట్ లిఫ్టర్లు కోనసీమ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో ఎనిమిది మంది, మహిళా విభాగంలో ముగ్గురిని ఎంపిక చేశారు. వీరు ఈ నెల 14న కాకినాడలో జరిగే జోనల్ స్థాయి, 18న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. పురుషుల విభాగంలో ఇళ్ల మల్లికసాయి, జల్లి జితేంద్ర దొర, కొండేటి వేణుమానస్, బుసకాల యశ్వంత్‌కుమార్, కొల్లి వరుణ్, దాసరి వేదేష్, దొమ్మేటి వేణుసాగర్, వసభక్తుల మణికంఠ, మహిళా విభాగంలో కొండేటి మేఘన, ఉందుర్తి శశికళ, యనమదల ఇందిర ఎంపికయ్యారు. వీరు జిల్లా తరఫున జోనల్, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. వీరు విజేతలుగా నిలిచి జిల్లాకు మంచి గుర్తింపు తేవాలని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి పీఎస్ సురేష్‌కుమార్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి, నేషనల్ వెయిట్ లిఫ్టర్ మారే వీరేంద్ర, జిమ్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, కోచ్‌లు ఆర్‌కే నాగేశ్వరరావు, వి.నరేష్, జి.గణేష్‌బాబు, యనమదల పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): కాకినాడ సురేష్ నగర్‌లోని శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో జరుగుతున్న ఏపీ, తెలంగాణ సీబీఎస్‌సీ క్లస్టర్ బ్యాడ్మింటన్ పోటీలు సోమవారం ముగిశాయి. అండర్–14, 17, 19 బాలుర విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీ, బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం విజేతలకు బహుమతులు అందజేశారు. డైరెక్టర్ విజయప్రకాష్ మాట్లాడుతూ, క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. పోటీల పరిశీలకులు గణేష్, రిఫరీలు పి.శ్రీనివాస్, భద్రం, ప్రిన్సిపాల్ శ్రీదేవి, మేనేజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అండర్–14 విభాగంలో మౌంట్‌లిటిరా స్కూల్ బంగారు, ఇండస్ యూనివర్శల్ రజత, సిల్వర్ హోక్స్ కాంస్య పతకాలు సాధించాయి. అండర్–17లో గాడియమ్ స్కూల్ బంగారు, డీపీఎస్ ఆనందపురం రజత, పల్లవి మోడల్ కాంస్య పతకాలు అందుకున్నాయి. అండర్–19లో సిల్వర్ హోక్స్ బంగారు, వికాస్ కాన్సెప్ట్ రతజ, నీలకంఠ విద్యాపీఠం కాంస్య పతకాలు కై వసం చేసుకున్నాయి.

వెయిట్ లిఫ్టింగ్ కోనసీమ జట్టు ఎంపిక