వైస్ చైర్మన్‌గా రామకృష్ణ ఎన్నిక
అమలాపురం రూరల్: జిల్లాల పునర్విభజన అనంతరం ఏర్పాటైన కోనసీమ జిల్లా ప్రజాపరిషత్ తొలి చైర్‌పర్సన్‌గా గొలపల్లి అమూల్య, వైస్ చైర్మన్‌గా ఎలిశెట్టి రామకృష్ణ ఎన్నికయ్యారు. అమలాపురం మండలం ఈదరపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులు టి.ప్రశాంతి సమక్షంలో ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి, జెడ్పీ సీఈఓ వసంత మాధవి ఎన్నిక నిర్వహించారు. తొలుత జిల్లాలోని 19 మంది జెడ్పీటీసీ సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, టీడీపీ నుంచి మామిడికుదురు జెడ్పీటీసీ సభ్యురాలు అమూల్యను చైర్‌పర్సన్‌గా, జనసేన నుంచి కొత్తపేట జెడ్పీటీసీ సభ్యుడు ఎలిశెట్టి రామకృష్ణను వైస్ చైర్మన్‌గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత వారిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.
రిగ్గుల నిర్వహణ సంస్థపై కేసు
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు డిమాండ్
అమలాపురం టౌన్: కేజీ బేసిన్‌లో ముఖ్యంగా కోనసీమలో తరచూ బ్లో అవుట్లకు కారణమవుతున్న డీప్ రిగ్గుల నిర్వహణ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చే యాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. సంస్థ ప్రతినిధులను తక్షణం అరెస్టు చేయాలని కలెక్టర్‌ను శుక్రవారం ఒక ప్రకటనలో కో రారు. రిగ్గుల కాంట్రాక్టును గుజరాత్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు చెందిన డీప్ సంస్థకు ఇచ్చారని ఆరోపించారు. రాజ్యాంగం ఆర్టికల్–14 ప్రకారం రిగ్గు లు నెలకొల్పే ముందు ఆయా సంస్థలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకొని, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని తెలిపా రు. కానీ, ఆ సంస్థలు ఈ అనుమతులు తీసుకోకుండానే డ్రిల్లింగ్ చేస్తున్నాయని ఆరోపించారు.


