జగన్‌తో సాకారం | - | Sakshi
Sakshi News home page

జగన్‌తో సాకారం

Aug 15 2026 12:22 AM | Updated on Aug 15 2026 12:22 AM

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
శనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026
గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం

గ్రామాలకు నిధుల వరద

1. గడప గడపకు మన ప్రభుత్వం

జిల్లాలో నిర్మాణాలు 1,102

కేటాయించిన నిధులు రూ.72.88 కోట్లు

2. జల్‌జీవన మిషన్‌

జిల్లాలో నిర్మాణాలు 834 ఆవాస

ప్రాంతాల్లో ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు,

పైప్‌లైన్ల నిర్మాణాలు

కేటాయించిన నిధులు రూ.515.93 కోట్లు

3. మెగా వాటర్‌ గ్రిడ్‌ రూ.1,650 కోట్లు

4. 209 జగనన్న లే అవుట్లలో నిర్మించిన కుళాయిలకు కేటాయించిన నిధులు

రూ.45.75 కోట్లు

5. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు

నిర్మాణ లక్ష్యం 24,644

కేటాయించిన నిధులు రూ.443.59 కోట్లు

గ్రామ స్వరాజ్యం అంటే ప్రతి గ్రామం ఆర్థికంగా, రాజకీయంగా పూర్తి స్వయంసమృద్ధి సాధించడం. ప్రతి పల్లె తన అవసరాలకు ఇతరులపై ఆధారపడకుండా ఒక స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ఉండాలి. దేశానికి నిజమైన స్వాతంత్య్రం గ్రామాల నుంచే ప్రారంభం కావాలి. పంచాయతీరాజ్‌ వ్యవస్థ ద్వారా తన పాలన తానే నిర్వహించుకోవాలి. కుల వివక్ష వంటి సామాజిక పిశాచాలు ఉండకూడదు. అందరూ సమానమే. ప్రతి గ్రామంలో ప్రాథమిక విద్య, వైద్యం, పరిశుభ్రమైన తాగునీరు, సహకార పద్ధతిలో అందరికీ సరిపడే వసతులు ఉండాలి. అదే నిజమైన గ్రామ స్వరాజ్యం.

– జాతిపిత మహాత్మా గాంధీ

సాక్షి, అమలాపురం: పాయలు పాయలుగా సాగుతున్న దేశ స్వాతంత్య్రోద్యమాన్ని ఏకతాటిపైకి తెచ్చి.. భారతీయులందరినీ అహింసాయుత పోరాట బాటలో ఏకోన్ముఖంగా నడిపించి.. బ్రిటిష్‌ వలస పాలకులను దేశం నుంచి తరిమికొట్టి.. భరతమాతకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలను సాధించిన గొప్ప నేత జాతిపిత మహాత్మా గాంధీ. దేశానికి నిజమైన స్వాతంత్య్రం పల్లెల నుంచే రావాలనే ఆకాంక్షతో గ్రామ స్వరాజ్యం గురించి ఆ మహనీయుడు ఎన్నో కలలు కన్నారు. కానీ, పాలకుల వైఫల్యంతో ఏడు దశాబ్దాలకు పైగా ఆ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. అటువంటి నేపథ్యంలో 2019–24 మధ్య.. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పాలనలో.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మన రాష్ట్రంలో సాకారమైంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రభుత్వ పాలనను పల్లె ముంగిటకే చేర్చి, దేశానికే ఆదర్శంగా నిలిచారు. గ్రామ సచివాలయం నుంచి రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే) వరకూ.. మన బడి నాడు–నేడులో పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దడం నుంచి విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ఏర్పాటు వరకూ.. వినూత్న చర్యలు చేపట్టారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలకు శాశ్వత మౌలిక వసతులు సమకూరాయి. రైతు భరోసా, ఉచిత పంటల బీమా, పెట్టుబడి రాయితీ వంటి పథకాలతో రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింది. ఇవే కాకుండా గడప గడపకూ మన ప్రభుత్వం, జల్‌జీవన్‌ మిషన్‌, పేదల ఇళ్లు, రహదారులు, వంతెనల వంటి నిర్మాణాలతో పల్లెల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలన లో గ్రామీణాభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో జిల్లాకు సంబంధించిన ఈ గణాంకాలే సాక్ష్యం.

ఫ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పెద్దపీట

ఫ గ్రామంలోనే అన్ని రకాల సేవలు

ఫ మినీ కలెక్టరేట్‌లా సచివాలయం

ఫ ఆర్‌బీకేలతో అన్నదాతకు వెన్నుదన్ను

ఫ గడవ వద్దకే చేరిన వైద్యసేవలు

ఫ నాడు–నేడుతో

పాఠశాలల, పీహెచ్‌సీల ఆధునికీకరణ

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో జరిగిన వివిధ నిర్మాణాలు

కేటగిరీ మొత్తం నిధులు కేటాయింపు నిర్మాణం ఖర్చు

నిర్మాణాలు (రూ.కోట్లు) పూర్తయినవి (రూ.కోట్లు)

ప్రభుత్వ భవనాలు 789 229.89 508 156.06

గ్రామ సచివాలయాలు 384 140.52 278 78.89

ఆర్‌బీకేలు 247 54.59 157 34.69

విలేజ్‌ హెల్త్‌ సెంటర్లు 158 30.57 73 28.55

నాడు–నేడు పాఠశాలలు 436 361.96 636 147.00

(తొలి దశ) + 761 (రెండో దశ)

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 6 9.21 6 9.21

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement