అమలాపురం రూరల్: పంద్రాగస్టు సంబరానికి జిల్లా కేంద్రమైన అమలాపురం ముస్తాబైంది. కలెక్టరేట్‌ను జాతీయ జెండాలు, స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాలతో అలకరించారు. జిల్లా స్థాయి వేడుకలు జరిగే స్థానిక బాలయోగి స్టేడియంలో మెయిన్ వేదికను సైతం ముస్తాబు చేశారు. కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి, డీఆర్‌ఓ సుబ్బారావు ఆధ్వర్యాన స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్య అతిథి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ప్రగతిని వివరిస్తారు. ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి అవార్డులు అందజేస్తారు. అనంతరం, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
పుష్కరాలకు
సమన్వయంతో పని చేయాలి
అమలాపురం రూరల్: వచ్చే ఏడాది జరిగే గోదా వరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ, అభివృద్ధి, మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కు మార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లా డారు. జిల్లాలోని 105 పుష్కర ఘాట్లలో 105 పనులకు రూ.39.50 లక్షలు కేటాయించినట్లు ఇరిగేషన్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. బ్యారికేడింగ్, మెస్ కాంక్రీట్, ఐరన్ పోల్స్, సైడ్‌వాల్స్, ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. విద్యుత్ స్తంభాలు, సరఫరా తదితర పనులకు రూ.13.70 కోట్లతో ప్రతిపాదించామని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆలమూరు మండలం నర్సిపూడి, పి.గన్నవరం మండలం మానేపల్లి, మలికిపురం మండలం గుడిమెళ్లంకలో మూడు సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచామని వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి, అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే, డీఆర్‌ఓ వి.సుబ్బారావు, ఆర్‌డీఓలు ఎ.సరళావతి, జీవీవీ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


